#


Index



జ్ఞాన యోగము భగవద్గీత

  అందుకే ఆయా కామ్యకర్మల వెంటబడి పోతుంటారు నూటికి తొంభయి మంది. ఇక వారికి నేనెక్కడ కనపడతాను. నాబదులు దేవతలే వారికి గోచరిస్తుంటారు. నన్నాయా దేవతల రూపంలో పట్టుకొంటున్నారే గాని నన్ను నన్నుగా భజించటం లేదు. దానికి కారణం వారి మనస్సులను కలవర పెట్టే ఆయురారోగ్య పుత్ర పౌత్ర ధనకనకాది విషయ వాంఛలే. అవి మనసులో మెదులుతున్నంత వరకూ నేను కనిపించను వారికి. నేనే కనిపించక పోతే నన్ను ఆశ్రయించి నావల్ల సర్వమూ నేనేననే జ్ఞానం గడించాలనే కోరిక ఎలా ఏర్పడుతుంది వారికి. ఏర్పడకుంటే ఎంత సర్వసమర్థుడనైనా నేను వారికెలా ప్రసాదించగలనని ప్రశ్నిస్తాడు. పరమాత్మ. ఆకలి లేని వాడి కన్నం పెట్టలేము గదా. అలాంటి వ్యవహారమిది.

  ఇంతకూ ఆయా విషయాల మీద అభిలాష ఉన్నంతవరకూ అది పరమాత్మ దర్శనాని కడ్డు తగులుతుంటుంది. అభిలాష తీర్చే వాడెవడో వాడే పరమాత్మ వారి దృష్టికి. అది ఆయా దేవతల రూపంలో వాడికి భాసిస్తుంటుంది. వారిని కూడా ఆత్మగాగాక అన్యంగా విషయంగా చూస్తుంటాడు. కాబట్టి వీడి విషయ వాంఛలకు తగినట్టే విషయ రూపులైన ఆ దేవతలు కూడా తమ కోసం నీవాచరించే కర్మలకు ముగ్ధులయి వీడికా కర్మఫల మంద జేస్తుంటారు. ఇదే ప్రవృత్తి ధర్మంలో ఉండే వ్యవహారమంతా. ఇంతకూ ఫలం కోసం చేసేదంతా కర్మే. జ్ఞానం కోసమని చేసేది కర్మగాదు. కర్మయోగం. అందులో విషయచింత Objective

Page 304

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు