జ్ఞాన యోగము
భగవద్గీత
ఇదేదీ మాకు అందుబాటులో లేదు కేవల మీ సంసార బాధలు పడలేక నిన్ను కీర్తిస్తుంటాను దేవా అని ఆర్తులైన మానవులకు వారి ఆర్తిహరణం చేస్తూ ఇలా వారి వారి ప్రపత్తిని బట్టి నేను అనుగ్రహిస్తుంటానే గాని నేనుగా స్వతంత్రించి వారికక్కర లేకపోయినా ఇవ్వటమంటూ ఉండదంటాడు భగవానుడని వ్రాస్తాడాయన.
అయితే మమవర్మాను వర్తంతే అని ఎలా అన్నారు మీరు. అందరూ మార్గంలోనే ఉన్నప్పుడందరూ మీ అనుగ్రహానికి పాత్రులేగదా. అంటే పాత్రులే కాని అందరూ ఒక్కటే కోరటం లేదు. నన్ను ఎవరేది కోరితే వారి కది ఇస్తాను. ఇవ్వకుండా పోను. అందరూ మోక్షం కోరితే మోక్షమే ఇవ్వగలను. కాని కోరటం లేదు గదా. రహస్యమే మంటే నాకందరూ కావలసిన వారే గాని అందరూ నన్ను కావాలను కోటం లేదు. నాది కావాలను కొంటున్నారు. నన్ను కావాలనుకుంటే నేనే దక్కుతాను వారికి. వారే జ్ఞానులు. అలాకాక నాది కావాలని ఆశ్రయిస్తే నన్ను మానేసి నాదే వారికిస్తాను. వీరే కర్మిష్టులూ ఉపాసకులూ వగైరా. నాకు మాత్రం నేనూ నేనే నాదీ నేనే. ఇదీ ఇందులో దాగి ఉన్న రహస్యం. అది గుర్తించిన వాడు జ్ఞాని. లేనివాడు అజ్ఞాని.
కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః |
క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా || 12 ||
Page 302