#


Index



జ్ఞాన యోగము భగవద్గీత

మార్గంలోనే ఉన్నాడర్జునా. అందరూ నాకాశ్రితులే. కాని వచ్చిన ఇబ్బం దేమిటంటే నేను వారిని ఆ శ్రితులుగా భావిస్తున్నానే గాని వారు నన్నలా భావించటం లేదు. మరెలా భావిస్తున్నా రంటారు. యే యధామాం ప్రపద్యంతే - ఒక్కొక్క రొక్కొక్క విధంగా భావిస్తున్నారు నన్ను.

  అంచేత నాదృష్టికి తగినట్టు వారు లేరు కాబట్టి తాంస్త థైవ భజామ్యహం – వారి దృష్టికి తగినట్టే నేను తయారవుతాను. ఎలాగా అని అడిగితే చెబుతున్నారు భాష్యకారులు. యే యత్ఫలార్థి తయా మాంప్రపద్యంతే - తాంస్తత్ఫల దానేన అనుగృహ్లామి ఎవరే ఫలం కావాలని నన్ను పట్టుకొంటారో వారికా ఫలమే అనుగ్రహిస్తాను. తేషాం మోక్షం ప్రత్యన ర్ధిత్వాత్ వారికి మోక్షఫల మక్కర లేదు. నహి ఏకస్య ముముక్షుత్వం ఫలార్థిత్వంచ యుగప త్సంభవతి. ముముక్షుత్వమూ కర్మఫలార్ధిత్వమూ ఏకకాలంలో రెండూ ఒక్కడికే కలగవు గదా - అంచేత యే ఫలార్ధినః తాన్ ఫలప్రదానేన - ఎవరు ఫలార్ధులై ఒక పని చేస్తుంటారో వారికా ఫలమిచ్చి - యే యధోక్త కారిణస్తు అఫలాసినః ముముక్షవశ్చ తాన్ జ్ఞాన ప్రదానేన - ఎవరు ఫలార్ధులు కారో కేవలం మోక్షం మీదనే దృష్టి పెట్టుకొని నిష్కామంగా కర్మయోగం పాటిస్తారో వారికి జ్ఞానం ప్రసాదించి - యేజ్ఞానినః సన్న్యాసినః ముముక్షవశ్చ - ఎవరు జ్ఞానవంతులయి అన్నీ పరిత్యజించి మోక్షానికి సిద్ధంగా ఉన్నారో తాన్ మోక్షప్రదానేన - వారికి మోక్షమిచ్చి - అలాగే ఆర్తాన్ ఆర్తి హరణేన

Page 301

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు