#


Index



జ్ఞాన యోగము భగవద్గీత

ప్రతిష్ఠాపన వల్లగాని జరగదు. దానికి నడుము కట్టటమే భగవదవతారం. అదే ఆయన ఉద్యమం. అది మాటి మాటికీ జరగవలసిందే తప్పదు.

  అయితే అవతారా లే యుగంలో జరిగాయి. కృత త్రేతా ద్వాపరాలలో జరిగాయని పురాణాలు వర్ణించటమే గాని మనం చూడలేదు దేన్నీ. కల్క్యవతారమా. కలియుగాంతంలో వస్తుందని చెప్పటమే. అదీ మనమిప్పుడు చూచేది కాదు. పోనీ దుష్టులు లేరా ఇప్పుడంటే లెక్కకు మిక్కిలిగా ఉన్నారు. మరి వీరిని శిక్షించటాని కింతవరకూ ఏ అవతరమూ రాలేదే అని ఇప్పటి వాళ్లకు పట్టుకొన్న ఆలోచన. ఒక్కమాట. ధర్మమంటే ఏదోగాదు. ధార్మికుడి గుణమే వాడి ప్రవర్తనే ధర్మం. అలాగే అధర్మం కూడా అధార్మికుడి గుణం. వాడి ప్రవర్తన. అందులో అధర్మపరుడైన మానవు డికి హితబోధ చేసి వాడి గుణాన్నీ వాడి ప్రవర్తననూ మార్చే ప్రయత్నమే భగవాను డవతరిస్తాడని చెప్పే మాట కరం. ఆ భగవాను డెవరో గాదు. ఆ అవతారమేదో గాదు. లోకంలో మన మక్కడక్కడా దర్శించే సాధుసజ్జనులే. ఆచార్య పురుషులే. యద్యదాచరతి శ్రేష్ఠః అని గీత వర్ణించిన ఉత్తమ మానవులే. భగవత్స్పరూపులే వారు. భగవద్విభూతి సంజాతులే. యద్యద్వి భూతి మత్సత్త్వ మని భగవానుడే స్వయంగా విభూతి పాదంలో వర్ణించ బోతున్నాడు. కాబట్టి ఇదీ మనమిందులో గ్రహించవలసిన అంతరార్ధం.

జన్మ కర్మ చ మే దివ్యమేవం యో వేత్తి తత్త్వతః |
త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోఽర్జున || 9 ||

Page 295

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు