#


Index



జ్ఞాన యోగము భగవద్గీత

  అవతారం. కావచ్చు. ఎలా అవతరిస్తా డాయన. ఎవరైనా సృష్టిస్తేనా లేక తనపాటికి తానేనా.

  ఇదుగో ఇది మరొక సత్యం. ఆత్మానం సృజామ్యహ మంటున్నాడు. తను తానే సృష్టించు కొంటాడట. మనబోటి మానవుల సృష్టి లాంటిది కాదిది. తల్లిదండ్రులు సృష్టిస్తే మనం సృష్టి అయ్యాము. మనపాటికి మనం కాదు. కాని పరమాత్మ అలా కాదు. ఆయనే సృష్టి కంతా మూలం కాబట్టి ఆయనను సృష్టించే తల్లిదండ్రు లెవడూ లేరు. ఉండటానికి వీలులేదు. మరి సృష్టి ఎలా. తన్ను తానే సృష్టించుకోగలడు. ఎలాగని. తాను తండ్రి - తన మాయా శక్తి తల్లి - తానంటే అఖండ చైతన్యం ఇది నిమిత్త కారణం తండ్రి. మాయ అంటే అఖండమైన దాని శక్తి. ఇది ఉపాదాన కారణం. తల్లి. ఈ రెండూ నిరాకారం గనుక తండ్రిగాని తండ్రి తల్లిగాని తల్లి. ఒకటి తాను వేసే ప్రణాళిక. మరొకటి దాని కనుగుణమైన నిర్మాణం. రెండూ కలిసి తానే గనుక తన్ను తానే సృష్టించుకోగలడు. శక్తిని వశం చేసుకొన్న వాడే చేయగలడు. మనం దానికి వశమై కూచున్నాము. గనుక మనమేదీ చేయలేము. గారడీడు లాంటి వాడాయన అయితే గారడీ చూచే వాళ్లం మనం. మనకు చేతగాదా సృష్టి. వాడికి చేతనవుతుంది. వాడే తాను తానుగానే ఉండి మరొక గారడీ వాణ్ణి తనలాంటి వాణ్ణి సృష్టిస్తాడు. అలాగే సృష్టించుకొన్నాడు భగవానుడు. అవే రామకృష్ణా

Page 292

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు