#


Index



జ్ఞాన యోగము భగవద్గీత

కొలవట మేమిటి. అగ్ని తన్ను తాను కాల్చుకొంటుందని చెప్పినట్టుంది. కనుకనే దాని నాభాస అన్నారు. అంటే అర్ధం. ఒకటి జరగకపోయినా జరిగినట్టు భాసించటమే ఆ భాస. ఒక స్వప్నంలాగా. ఒక ఇంద్రజాలం లాగా. అలాటిదే పరమాత్మ కృష్ణరూపంగా అవతరించటం. అలా జీవించటం. మరలా నిర్యాణమయి పోవటం. మనదీ మాయా మయమే ఆ మాటకు వస్తే. అయినా యధార్ధమని భావిస్తున్నా మీ జనన మరణాలు. అంచేత మనపాలిటికి యధార్ధమే అయి కూచున్నాయి. కారణం అనాది కాల ప్రవృత్తమైన మన అజ్ఞానం. ఈ అజ్ఞానం వదలకనే మనలాగా సర్వజ్ఞుడైన దేవుడికి కూడా జనన మరణాలంట గట్టి మానవుడిలాగే భావిస్తున్నాము మాధవుణ్ణి కూడా. కాబట్టి ఈశ్వరుడిది జన్మ అయినా జన్మ కాదు. మనబోటి జీవుడిది జన్మకాక పోయినా జన్మే. ఇదీ విషయం.

యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత |
అభ్యుత్థానమధర్మస్య తదాఽఽత్మానం సృజామ్యహమ్ || 7 ||

  అయితే మరలా ఒక ఆశంక. ఈశ్వరుడు జన్మించట మనేది సత్యం కాదు. అది కేవల మాభాసేనని గదా వర్ణించారు. మాయా శక్తిని వశం చేసుకొని అయినా ఆయన గారీ కర్మ భూమికి దిగి రావలసిన అగత్యమేమిటి. పోనీ తన చేతిలో లేదు. ఎవరో సృష్టిస్తే వచ్చాడను కొందామా అంటే ఎవరూ గాదు తన్నుతానే సృష్టించుకొన్నాడని గదా వర్ణిస్తున్నారు. అసలింత ప్రయత్న మా పరమాత్మ ఎందుకు చేయవలసి వచ్చింది. ఏమిటాయన దీనివల్ల ఆసించే ప్రయోజనమని ఇప్పుడు ప్రశ్న.

Page 289

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు