#


Index



జ్ఞాన యోగము భగవద్గీత

  కృష్ణస్వామి ఉన్నట్టుండి దేవకీ వసుదేవుల కెలా జన్మించాడు. ఆయన నీలమేఘ శ్యామల కోమలమైన ఈ దేహాన్ని ఎలా ధరించాడు. దానితో ఇంతకాల మెలా జీవించగలుగు తున్నాడు. ప్రజ్ఞానం బ్రహ్మ అన్నట్టు కేవల జ్ఞాన స్వరూపుడు గదా పరమాత్మ అంటే శుద్ధ బుద్ధ ముక్త స్వభావమని మీరే గదా వర్ణించారు. అలాంటప్పుడీ నామరూపాది కలాపమంతా ఎక్కడిదా తత్వానికి.

  దీనికి సమాధానమే ఈ శ్లోకం. వాస్తవమే. ఈ ప్రశ్న రావటంలో ఆశ్చర్యం లేదు. కాని అంతకన్నా ఆశ్చర్యమేమంటే అజోపి సన్ - నాకు జన్మ లేకపోయినా జన్మిస్తాను. అవ్యయాత్మా - వ్యయం లేకపోయినా అంటే మరణం లేకపోయినా మరణిస్తాను. అలాగే భూతానా మీశ్వరోపి సన్ సమస్త ప్రపంచానికీ ఈశ్వరుడనైనా అనీశ్వరుడైన జీవుడిలాగా జీవిస్తూనే ఉంటాను. కారణ మేమిటో తెలుసా. ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామి. నాకొక ప్రకృతి ఉంది. అది త్రిగుణాత్మిక. అది నాదే. నేనే. నాశక్తే కాబట్టి నాకు వేరుగాదది. నాకెప్పుడూ అధీనం. అలాటి ప్రకృతిని అధిష్ఠాయ స్వాధీనం చేసుకొని నాకిష్ట మయినప్పుడు సంభవామి - జన్మిస్తుంటా. ఒక దేహం ధరిస్తుంటా. అయితే అది నిజ మనుకోకండి మరలా. ఆత్మమాయయా. అది నా మాయ.

  మీయతే అనయా ఇతిమాయా అని వ్యుత్పత్తి. దేని ద్వారా పరమాత్మ తన్ను తాను కొలిచి పారేస్తున్నాడో అది మాయ. తన స్వరూపాన్నే తాను

Page 288

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు