#


Index



జ్ఞాన యోగము భగవద్గీత

  అలాంటప్పుడి దేమిటీ మాట. ఇద్దరికీ లేవన్న వాడిప్పు డిద్దరికీ జన్మ లున్నాయంటా డేమిటి. దీని కాయనే ఇస్తున్నాడు సమాధానం. రెండు ప్రశ్నలకూ సమాధానమిది. తాన్యహం వేద సర్వాణి - నత్వం వేత్థ పరంతప జన్మలు ఎన్ని గడచిపోయినా ఎన్ని జన్మలెత్తానో అవి ఎలా గడచిపోయాయో అదంతా నాకు ఒక స్వప్న చిత్రంలాగా కండ్లకు కట్టి నట్టు కనిపిస్తుంది. నత్వం వేత్థ - నీకు మాత్రమది లేశ మాత్రం కూడా గోచరం కాదు. కారణ మేమంటే భగవత్పాదులు బయట పెడుతున్నారు ధర్మా ధర్మ ప్రతిబద్ధ జ్ఞాన శక్తిత్వాత్ - ధర్మా ధర్మ రూపమైన కర్మల తాలూకు వాసనలడ్డు పడుతున్నాయి జీవుడి జ్ఞానానికి. అంచేత భూత భవిష్యత్తులను దర్శించే యోగ్యత లేదు దానికి - అందుకే వీడు జీవుడయ్యాడు. జ్ఞానం లేకకాదు. ఉండి కూడా అది చాలా పరిమితం.

  పోతే దేవుడి విషయమలా కాదు. అహం పునః నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావత్వాత్ అనావరణ జ్ఞానశక్తిః అంటారు భాష్యకారులు. ఈశ్వరుడు బుద్ధుడే గాక నిత్యముక్తుడు. అంటే ఆయన జ్ఞానం శరీరం మేరకే పరిచ్ఛిన్న మయినది గాదు. దేశకాలాలనే ఆవరణలు లేవు దానికి. ముక్తం. వాటి అవధులు దాటిపోయి సర్వవ్యాపక మైనది. అంచేత జన్మలెత్తినా వాటి జ్ఞానముంది ఈశ్వరుడికి.

  అలాంటప్పు డీశ్వరుడిది జన్మ అంటావా. ఎప్పుడూ జ్ఞాన మున్నప్పు డెలా జన్మిస్తాడు. ఎలా మరణిస్తాడు. జ్ఞానం కోలుపోతేనేగా జన్మా మరణం

Page 286

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు