#


Index



జ్ఞాన యోగము భగవద్గీత

అని కఠోపనిష ద్వాణి. జ్ఞాని అయినవాడికి బ్రహ్మ క్షత్రాలు రెండూ ఆహార మవుతాయట. ఏమిటీ మాటకర్ధం. జాతిపరంగా చెబితే ఏమైనా బాగుంటుందా. బ్రహ్మ అంటే మనస్సనీ క్షత్ర అంటే ప్రాణమనీ అర్ధం చెప్పుకోవాలి. అవి రెండూ జ్ఞానికి లయమయి పోవాలని అర్ధం. అప్పటికి జ్ఞాన క్రియాశక్తులకు ప్రతీకలే బ్రాహ్మణ క్షత్రియ జాతులు. జ్ఞానం సలహా ఇస్తుంటే ప్రాణమూ ఇంద్రియాలూ నడుచుకోవాలి. అందుకే అంటున్నాడు. పరమాత్మ మొదటి నుంచీ క్షత్రియులకే బోధిస్తూ వచ్చానీ యోగమని.

  అయితే ఏమి సుఖం. అది చాలా కాల మలాగే పనిచేసింది. సకా లేనేహ మహతా యోగో నష్టః కాలం గడచిన కొద్దీ బ్రహ్మ క్షత్రియ జాతులు రెండూ ధార్మికమైన బలం కోలుపోవటం మూలాన వారి మధ్య నడిచే ఈ యోగం కూడా బలం కోలుపోయి సంప్రదాయం చివరకు విచ్ఛిన్నమయంది. నష్టమయిందంటే పూర్తిగా అభావమయి పోయిందని గాదు. లుప్త మయిందని అర్ధం.

స ఏవాయం మయా తేఽద్య యోగః ప్రోక్తః పురాతనః |
భక్తోఽసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమమ్ || 3 ||

  కేవలం లుప్త మయింది గనుకనే మరలా నేను దానిని పైకి తీసి స ఏవాయం తేద్య యోగః ప్రోక్తః పురాతనః - పురాతనమైన ఆ యోగాన్నే నీకు బోధ చేస్తున్నా నంటాడు కృష్ణభగవానుడు. చాలాకాల మనుస్యూతంగా నడుస్తున్న ఒకానొక సంప్రదాయం మధ్యలో మానవుల అశ్రద్ధ వల్ల

Page 281

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు