కర్మ యోగము
భగవద్గీత
తాత్కలికంగా కవచం లాగా పని చేస్తుందంత మాత్రమే. అలాగే పరిశుద్ధమైన జ్ఞానాన్ని అజ్ఞానమనే ఉల్బం పొరలాగా కప్పి ఉన్నా శ్రవణ మననాదులు చేస్తూ పోతే కొంతకాలాని కది గూడా విరిసి పోతుంది.
అయితే అంతవరకూ దాని ధాటి తట్టుకోటం కష్టం. ఎందుకంటే నిత్యవైరి అది. ఎవరికి. అజ్ఞానికా. కాదు. జ్ఞానికి కూడా. ఆ మాటకు వస్తే జ్ఞానికే నంటారు స్వామివారు. ఎందుకంటే జ్ఞానికి మొదటి నుంచీ తెలుసు ఇది నన్ను అనర్ధానికి పురికొల్పుతున్నదని. ప్రారబ్ధం కొద్దీ దానివల్ల కష్టాల పాలవుతుంటాడు కూడా. తెలిసినవాడికే కష్టం. తెలియని వాడికేముంది. ఎలాగంటే అజ్ఞాని అయిన వాడు దాన్ని శత్రువుగా గాక తనకెంతో ఆప్తమిత్రుడని చూస్తాడు కామాన్ని. చివరకది తన్ను కష్టాల పాలు చేస్తే అప్పుడు బాధపడతాడు దీన్ని నమ్ముకొని దెబ్బతిన్నానని. కాబట్టి అజ్ఞానికి నిత్యవైరి కాదది. జ్ఞానికే నిత్యవైరి. అంతంలోనే దెబ్బతిని గుర్తిస్తాడు అజ్ఞాని. ఆద్యంతాలలో కూడా గుర్తిస్తూ పోతాడు జ్ఞాని. కాబట్టి వీడికే అది నిత్యవైరి అంటారాయన.
ఇదే కామమనే పిశాచి. ఆవృతం జ్ఞానమేతేన. జ్ఞానం బయట పడకుండా దాన్ని కప్పివేస్తుందిది. దుష్పూరేణ అనలేనచ - దుష్పూరమూ అనలమూ కూడా ఇది - దుష్పూరమంటే దాని కడుపు ఎంత తిండి పెట్టినా నిండదు. అనలం కూడా. అనలమంటే ఏదో అర్ధం చెప్పామింతకు ముందే. ఇక నాకేమీ అక్కరలేదు - ఇది చాలు ననే ప్రశ్న లేదు. ఎంత ఉన్నా తృప్తి లేదు మానవుడికి. ఇంకా పోగు చేసుకోవాలనే కాంక్ష. లోభమే
Page 268