#


Index

కర్మ యోగము భగవద్గీత

అది జరిగింది అనుభవించే వరకే. ఇది జరగబోయేది అనుసరించే వరకే. అలా కాకుంటే ఎప్పటికీ లేదు మనకు మోక్షం. ప్రయత్నానికే ఆస్కారం లేకపోతుంది. అసలింతకు ముందు ప్రయత్నం లేకుండా ప్రారబ్ధం మాత్రమెలా తయారయింది. కనుక ప్రారబ్ధ ఫలంగా ఇప్పుడీ వర్తమాన జన్మలో కష్టసుఖా లను భవిస్తున్నా మరలా ప్రయత్నం చేసి తత్ఫలమైన ఆత్మజ్ఞానం కూడా అందుకోవచ్చు మానవుడు. వర్తమాన మనేది సంగమ స్థానం రెండింటికీ. మానవుడు కర్తా భోక్తా కూడా కాబట్టి భయం లేదు. ఒకవైపు ప్రారబ్ధ ఫల మను భవిస్తుంటాడు. మరొకవైపు జ్ఞానఫలమైన ప్రయత్నం సాగిస్తుంటాడు. రెంటికీ అవకాశముంది. ఇదీ గీత చేసే పరిష్కారం.

శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ |
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః || 35 ||



  అయితే మరి పురుష ప్రయత్నమనేది చేయమని బోధించారు గదా. అది ఎలా చేయాలా ప్రయత్నం. అసలేమి చేయాలని ప్రశ్న వచ్చిందిప్పుడు. దానికి సమాధాన మిస్తున్నదీ శ్లోకం. శ్రేయాన్ స్వధర్మో విగుణః లోకంలో ప్రతి వ్యక్తికీ స్వధర్మ మనే దొకటి ఉంటుంది. ధర్మంచర అని ప్రతివాడికీ వాడి వాడికి తగిన ధర్మం విధించింది శాస్త్రం. పిల్లల మొదలు పెద్దల వరకు బ్రహ్మచారి మొదలు సన్న్యాసి వరకు బ్రాహ్మణుడు మొదలు శూద్రుడి వరకు అందరికీ వారికి వారాచరించిన వలసిన ధర్మాలంటూ ఉన్నాయి. అందులోనూ ఎవరి ధర్మం వారిదే. వాడే చేయాలా ధర్మం. మరొకడు చేసేది కాదు. అసలు చేయగూడదు. వాడు చేస్తేనే

Page 260

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు