#


Index

కర్మ యోగము భగవద్గీత

  ఇంద్రియ స్యేంద్రియ స్యార్ధే రాగద్వేషౌ వ్యవస్థితౌ ప్రతి ఇంద్రియానికీ ఇంద్రియార్థాలని ఉంటాయి. అర్ధాలన్న విషయాలన్నా తన్మాత్రలన్నా ఒకటే. ఏవోగావవి. శబ్ద స్పర్శ రూప రస గంధాలు. పంచభూతాల తాలూకు బంట్రోతులివి. వీటి ద్వారానే పాంచ భౌతికమైన ప్రపంచంతో సంబంధం మనకు. ఇలా ఇంద్రియాలకూ ఇంద్రియార్ధాలకూ వ్యవహారం జరుగుతుంటే అందులో రాగమూ కలగవచ్చు. ద్వేషమూ కలగవచ్చు. ఒకటి కావాలని అభిమానించటం రాగం అక్కరలేదని త్రోసివేయటం ద్వేషం. Likes and dislikes. ఇవి అవశ్యం భావి అన్నారు భాష్యకారులు. తప్పనిసరిగా ఉంటాయి.

  అయితే ఇది ఇక ఇంతేనా మన బ్రతుకని బేజారయి పోగూడదు. మానవుడు. ఇంతవరకూ ఇది ప్రారబ్దమైతే ఇక ప్రయత్నమేమిటో చెబుతున్నా మంటున్నది గీత. తయోర్న వశ మాగచ్ఛేత్. ఆ కలిగే రాగద్వేషాలకు వశమయి పోగూడదు మానవుడు. ఎలాగంటే ప్రకృతి లేదా ప్రారబ్ధ - మనేది సర్వస్వతంత్రం కాదు. దానికొక హద్దున్నది. అది ముందు మన మనస్సులో రాగద్వేషాలనే భావాలను కల్పిస్తుంది. ఆ రాగద్వేషాలు తరువాత మనల నొక కార్యానికి పురికొల్పుతాయి. పురికొల్పితే దాని కనుగుణంగా మన మా పనిలో ప్రవేశిస్తాము. తత్ఫలితంగా సుఖదుః ఖాలను భవిస్తుంటాము. అలా కాక మనసులో రాగద్వేషాలు పొటమరించినప్పుడే వాటిని త్రుంచి వేయగలిగితే చాలు. ఇక అవి పనికి పురికొల్పట మనేది జరగదు. పని చేయకపోతే ఫలితమనే దానికే ఆస్కారం లేదు. రాగద్వేషాలను

Page 258

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు