కర్మ యోగము
భగవద్గీత
గాని జ్ఞానికి లేదనటానికి వీలులేదు. అజ్ఞానీ జ్ఞాని అనే తేడా లేదు. ఎవడికీ తప్పదు ప్రారబ్ధ ప్రభావం. ప్రకృతిం యాంతి భూతాని. సమస్త మానవులూ. మానవులే కారు. ఆ మాటకు వస్తే పశుపక్ష్యాదులు కూడా. అయితే సాధన మార్గాన్ని గూర్చి మాటాడుతున్నాము కాబట్టి ప్రస్తుతం వాటి విషయం మనకక్కర లేదు. మానవులంతా తమలో తాము ప్రారబ్ధాని కధీనులయి బ్రతుకుతున్నవారే. నిగ్రహః కిం కరిష్యతి. నిగ్రహం నిగ్రహమంటే ఏమి పనిచేస్తుందా నిగ్రహం. అంటే అర్ధం. నీవిలా నడుచుకో అలా నడుచుకో. అహం మమలు పెట్టుకోకుండా కర్మయోగ మవలంబించు. శ్రవణ మననాదులు చేసి జ్ఞాన యోగ మవలంబించు అని ఇలా శాస్త్రమూ పెద్దలూ మానవుడి కెంత బోధించినా ఏమి ప్రయోజనం. ప్రారబ్ధమనే అడ్డు తొలగనంత వరకూ అది ఎలా ఫలిత మిస్తుంది.
మొత్తం మీద ప్రారబ్ధ మా ప్రయత్నమా మన జీవితాన్ని నడిపేదని ఒక పెద్ద ప్రశ్న వచ్చిందిప్పుడు. అంతా ప్రారబ్ధాన్ని బట్టే జరుగుతున్నది. మనమేమీ చేసేది లేదంటారు కొందరు. అలా కాదు. ప్రారబ్ధానికి కొంతవరకే బలం. దాన్ని మించిన బలం ప్రయత్నాని కుంది. అది మాన వద్దంటారు మరి కొందరు. ఇలా రెండు విభిన్నమైన అభిప్రాయా లున్నాయి లోకంలో. వీటిలో ఏది కరెక్టు ఏది కాదని ప్రశ్న రావటం సహజమే. దీన్ని ప్రస్తుతం భగవద్గీత ఎలా పరిష్కరిస్తుందో చూతాము.
ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ |
తయోర్న వశమాగచ్ఛేత్ తౌ హ్యస్య పరిపంథినౌ || 34 ||
Page 257