కర్మ యోగము
భగవద్గీత
అనుసరిస్తారో వారందరూ ముచ్యంతే తేపి కర్మభిః - తప్పకుండా కర్మబంధం నుంచి తప్పుకొని బయట పడతారు. కర్మలంటే ధర్మ మధర్మం కూడా నంటారు గురువుగారు. నిజంలో రెండూ బంధమే. ఒకటి ఇనుప సంకెల. మరొకటి బంగారు సంకెల. ఏదైతేనేం. సంకెళ్లు సంకెళ్లే.
ఇక్కడ ముచ్యంతే అన్నాడంటే వ్యాసభట్టారకుడు అసలైన ముక్తి కాదిది. అసలైన ముక్తి జ్ఞానం వల్లనే. కర్మయోగం వల్ల ముక్తి అంటే అది సత్త్వ శుద్ధి అయి జ్ఞానోదయమైతే క్రమంగా చివరకు కలిగేదని అర్ధం చేసుకోవాలి మనం. ఇదైనా భాగవతమైన మతాన్ని తూచా తప్పక పాటించే వారి మాట. వారు శ్రద్ధాభక్తి తత్పరులూ - అసూయావర్ణితులూ అయిన కర్మయోగులు.
పోతే యేత్వేత దభ్యసూయంతో నాను తిష్ఠంతి మేమతం - ఎవరలా కాక అసూయా పరులయి శ్రద్ధాసక్తు లణు మాత్రమైనా లేక నేను బోధించిన మార్గంలో నడచుకోరో తాన్ విద్దినష్టా న చేతసః - అలాంటి అవివేకులే జ్ఞానానికీ నోచుకోక ఎందుకూ పనికిరాక పాడయిపోతారని తెలుసుకోమంటాడు భగవానుడు. అనుభవజ్ఞుడు చెప్పింది వినాలి బాగుపడాలి గాని నాకొకడు చెప్పేదేమిటి నేను వాడి మాట వినేదేమిటని పొగరున బడితే ఏమవుతాడు మానవుడు. తనకు తెలియదు. ఒకరు చెబితే వినడు. ఇక శ్రేయస్సు కలగాలంటే ఎలా కలుగుతుంది. రెంటికీ చెడ్డరేవడై పోతాడలాటివాడు. ఇది అప్పుడే గాదిప్పుడు కూడా. సార్వకాలికమైన సత్యమిది.
Page 255