#


Index

కర్మ యోగము భగవద్గీత

మమలు రెండూ ఉండకూడదు. నేను చేస్తున్నానని గాని ఇదే నాకు లభించాలని గాని కర్తృత్వ భోక్తృత్వాలు పైన బెట్టు కోరాదు. అవే గదా జీవభావం. లోకులకూ కర్మిష్ఠులకూ అవి రెండూ అవశ్యంగా ఉంటాయి. వాటికి క్రమంగా స్వస్తి చెబితే గాని ఆత్మ జ్ఞానానికి నోచుకో రెవ్వరూ. కర్మయోగ మనేది అటు కర్మానుష్ఠానానికీ ఇటు ఆత్మ జ్ఞానానికీ ఒక వంతెన లాంటిది. ఇది దాటిపోతే జ్ఞానం. దాటకుంటే అనుష్ఠానం. దాటే ప్రయత్నం చేస్తున్నా నీకు భయం లేదు. యుధ్యస్వ విగతజ్వరః సంసారతాపం నీమీద అంతగా దాడి చేయ దర్జునా దానితో పారాడి నీవు గెలవగలవని హామీ ఇస్తాడు భగవానుడు. కారణం జ్ఞానమనే జీవితలక్ష్యం వాడికి దగ్గర దగ్గరగా కనపడు తుంటుంది.

యే మే మతమిదం నిత్యమనుతిష్ఠంతి మానవాః |
శ్రద్ధావంతోఽనసూయంతో ముచ్యంతే తేఽపి కర్మభిః || 31 ||

యే త్వేతదభ్యసూయంతో నానుతిష్ఠంతి మే మతమ్ |
సర్వజ్ఞానవిమూఢాంస్తాన్ విద్ధి నష్టానచేతసః || 32 ||

  కర్మలు మానవద్దు - తప్పకుండా చేయాలి మానవుడు. అయితే అనుష్ఠానం గాదు యోగమని ఇంతదూరం నేను వర్ణించి చెప్పానుగదా పైగా ప్రమాణం కూడా చూపి చెప్పాను. యేమే మత మిదం నిత్యమను తిష్ఠంతి. అలాంటప్పుడిది పెద్దలు చెబుతున్నారు గదా ఆచరిస్తే మంచి జరుగుతుందని శ్రద్ధావంతః అనసూయంతః శ్రద్ధా ళువులయి అసూయా బుద్ధి లేకుండా ఏ మానవులు నాఈ ఆదేశాన్ని మన్నిస్తారో అలాగే

Page 254

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు