కర్మ యోగము
భగవద్గీత
అంటే వారికున్న బుద్ధిని చలింప చేయగూడదు. అది కర్మకూ తప్పి జ్ఞానానికీ తప్పి ఉభయభ్రష్టమై పోతుంది. అసలు నీవెవరు నాకు చెప్పటానికని ఎదురు తిరిగినా తిరుగుతుంది. ఇది ఈనాటి మతప్రచారకుల కందరికీ ఎంతో గొప్ప హెచ్చరిక.
మయి సర్వాణి కర్మాణి సంన్యస్యాధ్యాత్మచేతసా |
నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః || 30 ||
అయితే అలాటి మందబుద్ధు లిక బాగుపడే అవకాశమే లేదా అంటే ఉంది. ఒకరిమాట కాదనకుండా విన్నా బాగుపడతారు. అలాకాక దైవికంగా వాడికే కర్మ చేసి చేసి కొంతకాలానికి విసుగుపుట్టి సరియైన దారికి వచ్చినా బాగుపడతారు. ఆ సరియైన మార్గ మేమిటని అడిగితే ఇప్పుడు బయట పెడుతున్నాడు పరమాత్మ.
మయి సర్వాణి కర్మాణి స్సన్యస్య - నామీదనే నీవు చేసే కర్మలన్నీ పారేయి. కర్మలు పారేయటమంటే అవి చేస్తున్నాననే కర్తృత్వ బుద్ధీ వాటి ఫలం నాకనుకూలించాలనే భోక్తృత్వ బుద్ధీ - రెండూ నని అర్ధం. మరి ఈ రెండు బుద్ధులూ పోవాలంటే వాటి కతీతమైన గొప్ప బుద్ధి ఏర్పడాలి నీకు. అదేదో గాదు. అధ్యాత్మ చేతసా. వివేకబుద్ధి. అంటే జ్ఞానం కాకపోయినా కర్మయోగం. అహంకర్తా ఈశ్వరాయ భృత్యవ త్కరోమి నేను కర్తనుగాదు. ఈశ్వరు డొకడున్నాడు. వాడు నాచేత చేయిస్తుంటే ఒక భృత్యుడిలాగా చేస్తున్నాను అనే బుద్ధి ఇది.
కనీస మిలాటి బుద్ధి ఉన్నా మంచిదే. అయితే ఇది కూడా అప్రయత్నంగా సిద్ధించేది కాదు. నిరాశీ ర్నిర్మమో భూత్వా అహం
Page 253