#


Index

కర్మ యోగము భగవద్గీత

  ఉత్సీదేయు రిమే లోకా న కుర్యాం కర్మ చేదహం - నేనే పనిమానేసి బద్ధకించానంటే అసలీ లోకాలే తల్లకిందులయి పోతాయి. నష్టమయి పోతాయి. సంకరస్యచ కర్తాస్యామ్ - ధర్మ సాంకర్య మేర్పడి పెద్ద విప్లవమే సంభవిస్తుంది. అంతేగాక ఈ ప్రజా నీకాన్నంతా నేనయి చెడగొట్టిన వాణ్ణవుతాను. ఉపహన్యా మిమాః ప్రజాః ప్రజలందరూ నశిస్తారు. నామూలంగా

  ఏమిటీ మాటలు. ఏమిటి పరమాత్మ తాత్పర్యం. శ్రేష్ఠుడైన వాడేది ధర్మమని ఆచరిస్తే అలాగే అందరూ పాటిస్తారని మొదట చెప్పాడే. దాని కిదంతా వ్యాఖ్యానం. వివరణ. అంచేత ఒక రంగంలో నాయకత్వం వహించే వాడికెలాంటి బాధ్యత ఉందో ఉండాలో మనకు గుర్తు చేస్తున్నాడు భగవానుడు. పోతే ఇంకా ఇందులో ఉన్న ఆంతర్య మేమంటే ఈశ్వరుడే కర్మ చేయటమనే బాధ్యత పెట్టుకోకపోతే ప్రపంచ సృష్టి ఎలా జరగాలి. ప్రజాజీవిత మెలా సాగాలి. సృష్టి స్థితిలయాలే గా ఈశ్వర కార్యం ఈశ్వరుడే సృష్టి చేయకుంటే మనకు యోగమే ముంది జ్ఞాన మేముంది. ఎవరేది సాధించాలి. సాధించి ఏ సిద్ధి పొందాలి. అంతా అసత్కల్పమే అయిపోతుంది. అంతా అసత్తనేది పారమార్ధిక సత్యమే అయినా వ్యావహారిక సత్యంగా ఈ జగత్తనే దొకటి జీవుడొకడూ వాడి జీవితమొకటీ కనిపిస్తున్నాయి గదా. అవి కనిపిస్తున్నవి గనుకనే వాటిని తాత్కాలికంగా పట్టుకొని కర్మ జ్ఞానయోగాలనే మోక్షమార్గంలో కృషి చేసి ఎప్పటికైనా ఆ పారమార్ధికమైన ఈశ్వరత్వాన్ని అందుకోవాలీ మానవు డప్పుడే ఈ మానవ జీవితం సార్ధక మవుతుందనే భగవదాశయం కూడా తొంగి చూస్తున్న దిందులో.

Page 246

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు