#


Index

కర్మ యోగము భగవద్గీత

  అన్నీ సమకూరినా నేను చేస్తున్నానంటే కర్మయోగికి చేస్తున్న ఉపదేశమిది. సర్వజ్ఞుడనైన నేనే కర్మ నాచరిస్తుంటే నీబోటి వాడాచరించక పోవటమేమిటి. తప్పకుండా కర్తవ్యం నీవు చేయాలని ఆదేశమిది. అంతే కాదు. అటు కర్మిష్ఠులకూ ఇటు జ్ఞానులకు కూడా కర్మాచరణ తప్పదని కూడా సూచనే. కర్మిష్ఠుడైతే యోగబుద్ధితో చేయాలని జ్ఞాని అయితే లోకసంగ్రహార్ధం చేయాలని సలహా. అది తన జీవితానికే ముడిపెట్టి చెప్పట మొక చమత్కారం.

  అంతేగాక ఇక్కడ ఒక రహస్యముంది. ఆయన పరమాత్మ అనే భావం కొట్టవచ్చినట్టు కనపడుతున్నదీ మాటల్లో. పరమాత్మ సర్వవ్యాపకుడూ కూటస్థుడూ గనుక ఆయనకే కర్మా లేదు. ఏ కర్మ స్పృహా లేదు. ఏ కోరికా తీరక పోవట మంటూ లేదు. ఆప్త కాముడూ. ఆత్మ కాముడూ అకాముడూ అని వర్ణిస్తున్న దుపనిషత్తు. అంతేకాదు. ఇలా ఉండిపోవట మా పరమాత్మ స్వరూపమైతే అన్ని పనులూ చేస్తూపోవట మాయ న విభూతి. అనేజ దేశం జవనో గ్రహీతా అని శాస్త్రం చెప్పినట్టు స్వామి వారి ద్విపాత్రాభినయం ధ్వనిస్తున్నది.

  పైగా యదిహ్యహం న వర్తేయ జాతు కర్మణ్యతంద్రితః - జాగ్రత్తగా నేనే పనీ చేయకుండా తప్పించుకొని కూచున్నానే అనుకో. మమ వర్త్మాను వర్తంతే మనుష్యాః - అంతవాడే అలా కూచున్నాడు గదా మనం మాత్రమెందుకు పెట్టుకోవాలీ కర్మలన్నీ. ఎగగొట్టి తిరిగితే తప్పేమిటట అని లోకులందరూ నామార్గాన్నే అవలంబించి సోమరులయి పోయినా పోవచ్చు. అంతేకాదు.

Page 245

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు