#


Index

కర్మ యోగము భగవద్గీత

న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన |
నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి || 22 ||

యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః |
మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః || 23 ||

ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహమ్ |
సంకరస్య చ కర్తా స్యాముపహన్యామిమాః ప్రజాః || 24 ||

  ఇంకా బోధిస్తున్నాడు కృష్ణ భగవానుడు. అది కూడా ఎవరి జీవితానికో గాదు. తన జీవితానికే అన్వయించి చెబుతున్నాడు. ఎప్పుడే గాని దానిమీద దీనిమీద నెపం పెట్టి చెప్పే దానికన్నా తన స్వానుభవమే ఆవిష్కరి స్తున్నప్పు డెదుటి వారి కా చెప్పే మాట మీద నమ్మకం బాగా కలుగుతుంది. అంతవాడే అలా నడుచు కొంటున్నప్పుడు మనం కూడా అలా నడుచుకోటంలో తప్పేముంది. అలాగే ప్రవర్తించటం మంచిదనే నిశ్చయం కూడా ఏర్పడుతుంది.

  ఏమి టిప్పుడు కృష్ణుడి వ్యవహారం. నమే పార్ధాస్తి కర్తవ్యమ్ అర్జునా నేను చేయ వలసిన దంటూ ఏదీ లేదు లోకంలో. నమే కర్మఫలే స్పృహా. ఒకటి చేయటమంటే దాని ఫలిత మాసించిగదా చేస్తాము. అలాటి ఫలాపేక్ష కూడా లేదు నాకు. నాన వాప్త మవాప్తవ్యమ్. పైగా ఇంతవరకూ నాకు లేనిదైతే దాన్ని ఆసించి చేయవలసి ఉంటుంది ప్రయత్నం. అన్ని కోరికలు నాకు ప్రాప్తించే ఉన్నప్పుడిక ఏది ప్రాప్తించాలని చేయాలి కర్మ. వర్త ఏవచ కర్మణి అయినా నేను పనులు పెట్టుకొంటూనే ఉన్నానా లేదా. మీ అందరి పనులూ నేను పెట్టుకొంటూనే ఉన్నాను గదా అంటాడు.

Page 244

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు