విషాద యోగము
భగవద్గీత
వెదకమంటున్నారే అది ఎక్కడ ఉందని వెదకాలని ప్రశ్నే లేదు. ప్రత్యక్షావ గమమ్ - ప్రత్యక్షంగా కళ్లకు కట్టి నట్టు కనిపిస్తూనే ఉంది. షోకేసులో సొమ్ములేనా నీకు కనిపిస్తున్నది. వాటితో పాటు వాటన్నిటినీ వ్యాపించిన బంగారం కూడా కనిపించటం లేదా. అలాగే చరాచర పదార్ధాలను చూస్తుంటే వాటి నావరించి ఉన్న సత్తా Existence స్ఫురత్తలు Appear-ance or Awareness కూడా గోచరమవుతూనే ఉన్నాయి. అవి పట్టుకోట మెంత కష్టమోనని కంగారు పడకు. వీటిని పట్టుకొంటున్నావంటే అవి ఉన్నాయనే భావమూ - అవి మనకు స్ఫురిస్తున్నాయనే భావమూ మనసుకు రావటం లేదా. కష్టపడకుండా వస్తుంది. సుఖం కర్తుమ్ - చాలా సులభంగా వస్తుందని గట్టిగా చాటుతున్నది భగవద్గీత.
పోతే అది మన దినచర్యలో ఎలా నిలుపుకోవాలని అడిగితే తస్మా త్సర్వేషు కాలేషు మా మనుస్మర. ఏ పనిచేస్తున్నా ఎప్పుడూ దాన్ని స్మరిస్తూ ఉండు. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ కళ్లు తెరిచి చూస్తున్నా-చెవులు పెట్టుకొని వింటున్నా - నాలుకతో ఏది రుచి చూస్తున్నా - సరే ఆ ఇంద్రియమూ ఆ విషయమూ - దాన్ని చేస్తున్న నీవూ - వాసుదేవ స్సర్వమితి -అంతా వసతి దీవ్యతి - అస్తి భాతి అంతకన్నా ఏమీ లేదిక్కడ. అదే ఈ రూపంలో నాకు సాక్షాత్కరిస్తున్నదనే స్మరణ ఏమరకుంటే చాలు. అది విస్మరణ లేకుండా చేస్తే తద్ద్వారా మరణానికి కూడా జవాబు చెప్పవచ్చు. ఎందుకంటే తత్త్వ విస్మరణమే మరణం. నిరంతర స్మరణమే జీవితమని ఘంటాపధంగా చాటుతున్నది గీత. ఇదే భగవద్గీత
Page 23