కర్మ యోగము
భగవద్గీత
భాసిస్తుంది. అది ఎలాగో చెబుతాను వినమని దాని ప్రక్రియ అంతా వర్ణిస్తున్నాడిప్పుడు వ్యాసభట్టారకుడు.
అన్నాద్భవంతి భూతాని. అసలు అన్నం వల్ల ఏర్పడుతున్నాయీ సమస్త భూతాలు. భూతాలంటే ఇక్కడ ప్రాణికోటి. ప్రాణులందరూ అన్నంవల్ల జన్మిస్తున్నారంటే ఏమిటర్ధం. లోహిత రేతః పరిణతా దన్నాత్తని వివరిస్తారు భాష్యకారులు. శుక్రశోణితాలుగా మారిన ఆహారం వల్లనని అర్ధం. మరి ఈ అన్నమెలా వచ్చింది. పర్జన్యా దన్న సంభవః - పర్జన్యమంటే మేఘమండలం. మేఘం వర్షిస్తే దానిచేత భూమి పదునై పంటలు పండితే దాన్ని భుజించటం వల్ల. మరి ఆ పర్జన్యమెలా వచ్చింది. యజ్ఞాద్భవతి యజ్ఞం చేస్తే తయా రయిందట. అగ్నే ప్రాస్తాహుతి స్సమ్య గా దిత్య ముప తిష్ఠతే – అగ్నిలో హోమం చేసిన ద్రవ్య మావిరి రూపంగా సూర్యమండలం వైపు పయనిస్తే - ఆదిత్యా జ్జాయతే వృష్టిః - తేజస్సు చల్లబడి వర్షం కురిస్తే - వృష్టేరన్నం - వర్షం వల్ల అన్నం మనకు లభిస్తున్నదట. పోతే ఈ యజ్ఞానికేది మూలమని అడిగితే యజ్ఞః కర్మసముద్భవః - కర్మ వల్ల నంటారాయన. యజ్ఞం చేయటమనేది ఒక కర్మే గదా.
ఇక్కడి కాగలేదు ప్రశ్న. అది ఒక పరంపర Series. కర్మ అన్నారే అది ఎక్కడి నుంచి అని మరలా ప్రశ్న. కర్మ ఎక్కడినుంచో గాదు. కర్మ బ్రహోద్భవం విద్ధి. బ్రహ్మమంటే ఇక్కడ వేదమని అర్ధం. వేదం చెబితే కర్మ లాచరిస్తున్నావు నీవు. లేకుంటే నీ విధ్యుక్త కర్మలేవో నీకు తెలియదు. కాబట్టి విహిత కర్మలన్నిటికీ మూలం వేదవాఙ్మయం. ఇక ఆవేదానికి ఏమిటి
Page 229