#


Index

కర్మ యోగము భగవద్గీత

పాతకమే ఆ మాటకు వస్తే. ఈ అయిదు పాతకాలూ పోవాలంటే అయిదు యజ్ఞాలు చేస్తే సరిపోతుందన్నారు. అందులో దేవ యజ్ఞం చేస్తే అన్నిటికీ జవాబు. ఇదిగాక ఇంకా మన ఏమరుపాటు వల్ల జరిగే దోషాలేవి ఉన్నా అవీ ఊడ్చుకు పోగలనవి హామీ ఇచ్చారు.

  కనుక యజ్ఞానుష్ఠానాని కింత ప్రభావమున్నది. అలాటి యజ్ఞకర్మ మానేసి యే పచంత్యాత్మ కారణాత్ - దేవతలకు నివేదించకుండా తన కడుపు నింపుకోటమే పరమార్ధమని ఎవరు భావిస్తారో వారు భుజించేది అన్నం కాదు. తే త్వఘం భుంజతే పాపాః మరేమిటంటారు. తాము చేసుకొన్న పాపాన్నే తాము భుజిస్తున్నారు. వంట చేసుకొని తింటున్నారని పేరేగాని అది వంటగాదు. పాపఫలం. వంటకం గాదది పాపమే. తిన్నా సుఖం లేదు. స్వార్ధం కోసం ఏపని చేసినా అది ఫలిత మివ్వదని భావం.

అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్నసంభవః |
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః || 14 ||

కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముద్భవమ్ |
తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్ || 15 ||

  అసలు యజ్ఞమంటే ఏమను కొంటున్నావు నీవు. ఏదో హోమకుండ మొకటి త్రవ్వి సమిధలు పోగు చేసి అగ్ని అక్కడ ఆధానం చేసి ఋత్విక్కులు మంత్రాలు చదువుతుంటే జరిపే ఒకానొక క్రియ మాత్రమేనని భావిస్తున్నావా. క్రియే అయితే కావచ్చు. కాని ఆ క్రియకు మూలమేదో తెలుసా. దాని ఆద్యంతాలు గుర్తిస్తే అది ఎంత పవిత్రమైనదో నీకు

Page 228

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు