#


Index

కర్మ యోగము భగవద్గీత

యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః |
భుంజతే తే త్వఘం పాపా యే పచంత్యాత్మకారణాత్ || 13 ||

  అలాకాక దొర బతుకే బతకాలనే ఆకాంక్ష ఉంటే మానవుడు తప్పించుకొని తిరగగూడదు జీవితంలో. పశుపక్ష్యాదుల బ్రతుకు బ్రతకగూడదు. ఈ మానవజన్మ నెవరు మనకు ప్రసాదించారో వారి ఋణం తీర్చుకొనే ప్రయత్నం చేయాలి. దేవహితం యదాయుః అని శాస్త్రవచనం. దేవతలే ఇచ్చారు మనకీ జన్మ. అందుకోసం వారికి ఋణపడి ఉన్నాము మనం. వారి ఋణం తీర్చుకొని ఆనృణ్యం పొందాలంటే యజ్ఞం చేయాలి వారి కోసం. యజ్ఞశిష్టా శినః సంతః యజ్ఞం చేయగా ఏది శేషించిందో దాన్నే మనం స్వీకరించాలి. దాని కమృతమని పేరు. అతిధి భుక్తశేషానికి విఘస మనీ దైవదత్త శేషానికి అమృతమనీ శాస్త్రం పెట్టిన పేర్లు.

  అలాటి అమృతాన్ని సేవిస్తే ముచ్యంతే సర్వ కిల్బిషైః ఇక ఏ పాపఫలమూ అంటదు మానవుణ్ణి. అన్ని పాపకర్మల నుంచీ బయట పడతాడని మనకు శాస్త్ర మిచ్చే హామీ. ఏమిటా పాపాలంటే చెబుతున్నారు భగవత్పాదులు. చుల్ల్యాది పంచసూనాకృతైః ప్రమాదకృత హింసాది జనితైశ్చ అనేకైః అని. పేషణీ కుట్టనీ చుల్లీ ఉదకుంభీ చ మార్జనీ అని ఇవి అయిదు పాపాలు. ప్రతి దినమూ చేస్తూనే ఉంటారు గృహస్థులు. పిండి పిసికేటప్పుడూ - ధాన్యం దంచేటప్పుడూ - పొయ్యి రాజేసేటప్పుడూ నీళ్లలో కడవ ముంచేటప్పుడూ - చీపురు పెట్టి ఇల్లు ఊడ్చేటప్పుడూ ఎన్నో సూక్ష్మజీవులు చనిపోతుంటాయి. అదంతా మనకు చుట్టుకొనే

Page 227

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు