కర్మ యోగము
భగవద్గీత
ఇలాటి యజ్ఞం నిరంతరమూ మానవు డాచరించక తప్పదు. అలాటి మనస్తత్త్వంతోనే జన్మించాడు మానవుడు. అలాటి మనస్తత్త్వంతోనే బ్రతుకుతున్నాడు బ్రతికినంత కాలమూ. ఇక యజ్ఞం చేయక తప్పేదేముంది. కాని శాస్త్రమిప్పుడు మనకు చెప్పే సలహా ఏమంటే ఆ చేసే యజ్ఞం నీకు ఫలిత మివ్వాలంటే అది నీకు కావలసిన వన్నీ సమకూర్చాలంటే నీవు సుఖపడాలంటే ఒక మంచి మార్గముంది దానికి. అది ఏదోగాదు. నీకు తెలియని ఒక రహస్యం చెబుతున్నాను విను.
దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః |
పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ || 11 ||
కర్మరూపమైన ఈ యజ్ఞం నీవు త్రికరణాలతో ఆచరిస్తున్నప్పుడు దేవాన్ భావయ తానేన. దేవతలనే వారొకరున్నారని గ్రహించి వారి ప్రీత్యర్థ మాచరిస్తూ పో. అలా వారి కోసమని ఆచరించావంటే తే దేవా భావయంతు వః – ఆ దేవతలు కూడా సకాలంలో వర్షాలూ అవీ కురిపించి పంటలు పండించి తద్వారా నీకు సంతృప్తి కలిగిస్తారు. పరస్పరం భావయంతః ఇలా ఒకరికొకరు మేలు చేస్తూ పోయారంటే దానివల్ల మీకే లాభం. దేవతాను గ్రహం వల్ల మీరు జీవితంలోనూ జీవితానంతరమూ సకల శ్రేయస్సులూ పొందగలరు. పరం శ్రేయః అన్నారు కాబట్టి చివరకు మోక్షమనే ఫలాన్ని కూడా అందుకోగలడు మానవుడు.
ఇష్టాన్ భోగాన్ హి వో దేవా- దాస్యంతే యజ్ఞ భావితాః
తైర్దత్తా నప్రదాయైభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః - 12
Page 225