కర్మ యోగము
భగవద్గీత
అర్జునుడి కేమిటి మనకేమిటి ఇది అందరికీ చేస్తున్న మహోపదేశం.
సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః |
అనేన ప్రసవిష్యధ్వమేష వోఽస్త్విష్టకామధుక్ || 10 ||
కాకపోయినా అసలు యజ్ఞమనేది చేయకుండా ఏ మానవుడూ తప్పించుకోలేడు. భౌతికమైన యజ్ఞమైనా చేయాలి. ఆధ్యాత్మికమైనా చేయాలి. ఎందుకంటే యజ్ఞంతో సహా సృష్టించా డసలు మొదట ఈ మానవ జాతినా ప్రజాపతి. సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా - పురోవాచ. అలా సృష్టించి వారికి ఒక హుకుం జారీ చేశాడాయన గారు. అదేమిటంటే అనేన ప్రసవిష్యధ్వం. ఇదుగో ఈ యజ్ఞానుష్ఠానం ద్వారా మీరు సంతానాన్ని కంటూ పొండి. ఏషవో స్విష్ట కామధుక్ అలా చేస్తే మీకీ యజ్ఞ కర్మే అన్ని కోరికలూ నెరవేర్చగలదు అని బోధించి పంపాడట ఈ కర్మభూమికి.
కర్మభూమి అంటేనే కర్మకు నిలయమైనది. ప్రజాపతి మనలను సృష్టించాడంటే అది కర్మ. మనమిక్కడ జన్మించామంటే కర్మ. మనసుతో ఆలోచిస్తూ పనులు చేస్తున్నామంటే కర్మ. తత్ఫలితంగా సుఖదుఃఖాలను భవిస్తూ జీవిస్తున్నామంటే కర్మ. మనకే పిల్లపాప లేర్పడుతున్నారంటే అదీ కర్మే. చివరికంతా వారి కప్ప జెప్పి మన శరీరాన్ని కూడా ఈ కర్మ భూమికే అంకితం చేసి కన్ను మూస్తున్నా మంటే అదీ కర్మగాక మరేమిటి. అంచేత మన జీవిత మాది మధ్యాంతాలంతా కర్మమయం. అదే యజ్ఞమనే మాట కిక్కడ అర్థం. జీవితమే ఒక మహాయజ్ఞం.
Page 224