#


Index

కర్మ యోగము భగవద్గీత

ఇలాంటి ఫలితం మీద ఉంటుంది. ఈశ్వరుడి కర్పించటం లేదు కాబట్టి అది వాణ్ణి బంధిస్తుందా కర్మ ఫలం.

  అయితే మరి ఎలాగైతే బంధించదు కర్మ. యోగంగా మారినప్పుడే బంధించదు. స్వార్ధం కోసం గాక ఈశ్వరార్పణ మంటూ చేస్తాడు వాడు ప్రతికర్మా. అప్పుడది వాడికి చెందదా ఫలం. మరి ఎవరికి చెందుతుంది. ఈశ్వరుడికా. వాడి కసలే అక్కర లేదది. ఎవరికీ దక్కకపోతే ఏమవుతుంది. నిరింధనమైన అగ్నిలాగా తనకుతానే ఆరిపోతుంది. లయమై పోతుంది. ఫల్గుతయా లీయతే ఇతి ఫలమని ఫలశబ్దానికి వ్యుత్పత్తి - నిరర్దక మయితే అక్కడికి సమసిపోక ఏమవుతుంది.

  మరి జ్ఞానమనే ఫలముంది గదా కర్మయోగికి. నిరర్ధకమెలా అవుతుంది. నిజమే. ఫలమంటే ఇక్కడ పితృలోక స్వర్గలోకాది ఫలం ఉత్తమ భోగాను భవ ఫలం. వాటి మీద దృష్టి లేదు కాబట్టి వాడికా ఫలమే లయ మవుతుంది. కాని జ్ఞానమనే ఫలం మాత్రం అలా లయమయి పోదు. అది ఆత్మ స్వరూపం కాబట్టి ఆత్మ అనేది సర్వదా సర్వత్రా ఉంది కాబట్టి అది ఫలస్వరూపమే. ఇక ఫలమనేది లయమయ్యే ప్రశ్నేముంది. ఆత్మ రూపంగా ఎప్పుడూ ఉంటుందది క్రొత్తగా అందుకోవలసింది కాదు. అందే ఉన్నది. అంచేత తదరం కర్మ కౌంతేయ ముక్తసంగ స్సమాచర. ఆ జ్ఞానమనే ఫలం కోసం మాత్రమే నీవు మరే స్వర్గాది ఫలాల మీద ఆసక్తి చూపకుండా కర్మయోగ మాచరిస్తూ పో అర్జునా. అది నీకు ఫలంగాని ఫలం జ్ఞానమనే మహాఫల మెప్పటికైనా అందజేస్తుందంటాడు.

Page 223

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు