#


Index

కర్మ యోగము భగవద్గీత

యజ్ఞార్థాత్ కర్మణోఽన్యత్ర లోకోఽయం కర్మబంధనః |
తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచర || 9 ||

  అయితే ఇక్కడ ఒక చిన్న సందేహం. కర్మ అనేది ఏదైనా కర్మే గదా. అది నిషిద్ధ కర్మ కావచ్చు. విహిత కర్మ కావచ్చు. కామ్యం కావచ్చు. లేదా కర్మయోగమే కావచ్చు. అన్నీ కర్మలే. మనోవాక్కాయాలనే త్రికరణాలతో ఆచరించేవే. అన్నీ ప్రకృతి గుణాలతో ముడిపడి ఉన్నవే. అలాంటప్పుడిక మంచీ చెడ్డా అనే తేడా ఏముంది. అన్నీ మనలను బంధించి ఈ సంసార సాగరంలో పడదోసేవే గదా అని ఆశంక. దీనికి సమాధాన మిప్పుడీ శ్లోకం.

  యజ్ఞార్ధాత్ కర్మణః అన్యత్ర లోకోయం కర్మబంధనః - యజ్ఞం కోసమని చేసే కర్మ అయితే అది నిన్ను బంధించదు. మిగతా ఏ కర్మ అయినా నీకు బంధకమే నంటాడు పరమాత్మ. యజ్ఞ మేమిటి. యజ్ఞోవై విష్ణుః అని వ్యాఖ్యానించారు భాష్యకారులు. యజ్ఞమంటే ఈశ్వరుడని అర్ధమట. ఎవరిని మనం యజిస్తామో Worshipping వాడు యజ్ఞం. ఎవడోగాదు వాడీశ్వరుడే. అంతేగాని అగ్నిష్టోమ జ్యోతిష్టో మాదులుగా విక్కడ యజ్ఞమంటే. అవి భౌతికమైన యజ్ఞాలైతే ఇది ఆధ్యాత్మికం Spiritual sacrifice. అలాంటి ఈశ్వరార్పణ బుద్ధితో నీవే పని చేసినా అది నిన్ను బంధించదు. ఇదే కర్మయోగం. కేవల కర్మాచరణ కాదు. కర్మాచరణ అయితే అందులో ఈశ్వరార్పణ బుద్ధి లేదు ఆచరించేవాడికి. ఉత్తమ లోకాలు రావాలని ఉత్తమ భోగాలను భవించాలని ఉత్తమ జన్మ రావాలని

Page 222

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు