కర్మ యోగము
భగవద్గీత
దేమిటి వాడు సాధించే దేమిటి. పరం మాట దేవు డెరుగు. ఇహ జీవితమే లేదు వాడికి. అంచేత ఇహంలో బ్రతకటానికైనా కర్మ చేయక తప్పదు.
ఎలాగూ తప్పదు గనుక ఆ చేసే కర్మ శాస్త్రం విధించిన సత్కర్మలే ఆచరించటం మంచిది. అది ఇహానికీ పరానికీ పనికి వస్తుంది. అంతేకాదు. కేవలం విహిత మని చేస్తే నీకు పితృలోకం తప్ప మరే ఫలితమూ లేదు. అదీ శాశ్వతం కాదు. మరలా నిన్ను తెచ్చి ఈ కర్మభూమి మీద పడేసేదే. అది నీ జీవిత సమస్యకు పరిష్కారం కాదు. కాబట్టి ఆత్మజ్ఞానానికి దోహదం చేసే కర్మ ఏదో అది ఆచరించట మింకా వాంఛనీయం. దానినే కర్మయోగ మని వర్ణిస్తూ వచ్చాము. అదీ నియతమే నీకు. అటూ ఇటూ చెదరిపోకుండా నీవు చేసే కర్మలన్నిటినీ జ్ఞానాభిముఖంగా తీసుకువెళ్లుతుంది గనుక నియతమది. అందులో కర్తృత్వ భోక్తృత్వ బుద్ధులు రెండూ క్షాళితమై పోతాయి కాబట్టి నియతమంటే నియతమది. జ్ఞానం వైపే తప్ప నిన్ను ప్రక్కకు పోనివ్వదు. అలాటి యోగమార్గంలో మానవుడు ప్రయాణం చేస్తున్నప్పు డిక శరీరయాత్ర కోసం వాడంతగా ప్రాకులాడ నక్కర లేదు. దానిపాటి కదే జరిగిపోతుంది. జ్ఞానమనే లక్ష్యం మీదనే దృష్టి పెట్టుకొని బ్రతుకు సాగిస్తుంటాడు కాబట్టి అదేవాడి కన్నీ సమకూరుస్తుంది. కాకపోయినా ప్రారబ్ధమనే దొకటి ఉన్నప్పుడు భయమేముంది. ఏది ఎప్పుడు ప్రాప్తించాలో అది వాడి ప్రారబ్ధ వశాత్తూ ప్రాప్తిస్తూనే ఉంటుంది గదా. దానితోనే తృప్తి చెందగలడు మానవుడు.
Page 221