కర్మ యోగము
భగవద్గీత
రాబోతున్నది గదా. అది ఎలా బోధించాడు పరమాత్మ అని ప్రశ్న వస్తుంది. వాస్తవమే బోధించాడు. కాదనలేదు. కాని దాని కర్ధమేమిటో గురువుగారు చెబుతున్నారు వినండి. సన్న్యసనా దేవ కేవలా త్కర్మ పరిత్యాగ మాత్రా దేవ జ్ఞాన రహితాత్. జ్ఞానమనేది ఉదయించకుండానే కర్మలు పరిత్యజించట మని ఇక్కడ సన్న్యాసమనే మాట కరం. మరి జ్ఞానోదయమైన తరువాత చెప్పింది అక్కడ ఆ అధ్యాయంలో సన్న్యాసమనే మాట కర్ధం. అక్కడ జ్ఞానంలో కర్మలు లయమవుతాయి. కాబట్టి విడిగా ఇక ఏ కర్మా కనపడదు జ్ఞానికి. కర్మలన్నీ జ్ఞాన స్వరూపంగానే దర్శన మిస్తాయని భావం.
న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్ |
కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః || 5 ||
కాకపోయినా ఒక మాట గుర్తుంచుకోవాలి మనం. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠతి అకర్మకృత్ - పని అనేది ఏ ఒక్కటీ చేయకుండా ఏ మానవుడు గానీ ఒక్క క్షణకాలం ఊరక కూచోగలడా. కూచోలేడు. శరీరంతో కాకపోతే వాక్కుతో - వాక్కుతో కాకపోతే మనస్సుతోనైనా చేస్తుంటాడు కర్మ. త్రికరణాలని గదా వీటికి పేరు. మనోవాక్కాయాలే త్రికరణాలు. కరణమంటే కర్మ చేయటానికి సాధనమని అర్ధం. కర్మ సాధనాలు దగ్గర పెట్టుకొని నేనే కర్మా చేయనని భీష్మించుకొని ఎలా కూచోగలవు. అవి నిన్ను కూచోనిస్తాయా. ఒకటి కాకుంటే ఒకటి నిన్ను పురికొల్పుతూనే ఉంటుంది. ఆఖరుకు మనసైనా నిన్ను వదలి పెట్టదు.
Page 212