కర్మ యోగము
భగవద్గీత
అంచేత జ్ఞానమే గదా ముఖ్యం ఈ కర్మదేనికని మానేసి కూచోరాదు. న కర్మణా మనారంభాత్ నైష్కర్మ్యం పురుషోశ్నుతే. కర్మల నాచరించకపోతే అసలు నీవు నైష్కర్మ్య మనేది ఆసించలేవు. నిష్కర్మ భావమే నైష్కర్మ్యం. అంటే జ్ఞానమని అర్ధం. జన్మ జన్మల నుంచీ పోగైన పాపకర్మలన్నీ నశించి నీ సత్త్వం శుద్ధి కావాలంటే నిష్కామ రూపమైన కర్మ యోగం పాటించి తీరవలసిందే. జ్ఞాన ముత్పద్యతే పుంసాం క్షయా త్పాపస్య కర్మణః అని వ్యాస భగవానుడే సెలవిచ్చాడు. అప్పుడు యధా దర్శతల ప్రఖ్యే పశ్యత్యాత్మాన మాత్మని. అద్దంలో కనిపించినట్టుగా కనిపిస్తుంది నీ స్వరూపం నీకంటా డాయన.
కనుక కర్మ మానేయటం కాదు. మీదు మిక్కిలి కర్మారంభమే ఉపాయం నిష్కర్మ భావానికని సెలవిస్తారు భాష్యకారులు కూడా. నహ్యుపాయ మంతరేణ ఉపేయ ప్రాప్తి రస్తి. ఉపాయాన్ని పట్టుకోకుండా ఉపేయమెలా సిద్ధిస్తుందని అడుగుతారాయన. నహి సన్న్యసనా దేవ సిద్ధిం సమధిగచ్ఛతి. కర్మలేవీ చేయనని సన్న్యసించినంత మాత్రాన నీకు జ్ఞానమనేది సిద్ధించదు. సిద్ధించదు సరిగదా ఉభయభ్రష్టుడ వయిపోతావు. సోమరిపోతు వని పించుకొంటావు. గమ్యం లేని ప్రయాణ మవుతుంది నీ బ్రతుకు. అలాగైతే పశుపక్ష్యాదుల జీవితానికీ మానవ జీవితానికీ తేడా ఏముంది.
మరి కర్మ సన్న్యాసమనే మాట ఎలా వచ్చింది. దాని కర్ధమే లేదా. లేకుంటే గీతలో తరువాత 5 వ అధ్యాయంలో కర్మ సన్న్యాసమనే యోగం
Page 211