విషాద యోగము
భగవద్గీత
కాబట్టి ఇలాంటి విపర్యయ మనే మూడవ వ్యాధికి కూడా చికిత్స చేయగలిగి నప్పుడే మానవుడికి ఘన విజయం. ఏమిటది ఎలాగ ఏదోగా దది నిది ధ్యాస. నిధ్యాతు మిచ్చా నిది ధ్యాసా అన్నారు. నిధ్యాన మంటే బాగా నిగా పెట్టి చూడటం. Close keen total attention - Observation. ఏకాగ్రత అనుకోండి. భూతేషు భూతేషు విచిత్య అని కేనోపనిషత్తు చెప్పినట్టు ఏది చూచినా అస్తి భాతి అంతకన్నా విశేషమేమీ లేదని తదేక దృష్టితో బ్రతుకు సాగించటం. బ్రహ్మ పశ్చాద్య్రహ్మ పురస్తా తన్నట్టు భావం లోనూ బాహ్యంలోనూ ఎక్కడ ఎప్పుడు ఏది చూచినా అంతా బ్రహ్మమయం అంతా ఆత్మమయం మరొక విజాతీయ భావమే మనసుకు రాకూడదు. ఇదీ నిది ధ్యాస అంటే. విజాతీయ ప్రత్యయానంతరిత సజాతీయ ప్రత్యయ ప్రవాహః అని శాస్త్రమే ఘోషిస్తున్నది. ఇలాంటి ధ్యాన మలవడితే మన మపర ప్రహ్లాదులమూ అపర కుచేలురమూ అయిపోతాము. సందేహం లేదు. యాజ్ఞవల్క్య మహర్షి హామీ ఇచ్చినట్లు తప్పకుండా మన కాత్మ ప్రత్యక్షమయి తీరుతుంది. ఇదం సర్వం యదయ మాత్మా. ఆత్మా నాత్మలనే హద్దు చెరిగిపోయి సర్వమూ ఆత్మ స్వరూపంగానే దర్శనమిస్తుంది. ఇక ఏ సమస్యా ఉండబోదు. సంసారం కాదప్పుడు మనకది సాయుజ్యమే.
కాని ఇలాంటి మహా భాగ్యం సాధకుడికి లభించాలంటే సామాన్యం కాదు. విపర్యయమనే మూడవ వ్యాధికి కూడా మందు పడాలి. మందు నిది ధ్యాసే అయినా దాని వల్ల చేకూరే ఆరోగ్యం ఆత్మానుభవమే మోక్షమే అయినా అది మనకు ప్రసాదించే గొప్ప వైద్యనాధుడు కావాలి.
Page 21