కర్మ యోగము
భగవద్గీత
వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే |
తదేకం వద నిశ్చిత్య యేన శ్రేయోఽహమాప్నుయామ్ || 2 ||
ఏమయ్యా బావగారూ. ఏమిటీ అన్యాయం. జ్యాయసీ చే త్కర్మణస్తే మతా బుద్ధిః - జ్ఞాన మనేది కర్మ కన్నా చాలా గొప్పదనే అభిప్రాయ మున్నట్టుంది నీకు. అలాంటప్పుడు నాకా జ్ఞానమే ఉపదేశించ రాదా. తత్కింకర్మణి ఘోరేమాం నియోజయసి. ఈ ఘోరమైన కర్మనే చేస్తూ పొమ్మని నాకెందు కీ కర్మమార్గాన్ని సిఫారసు చేస్తున్నావు. కర్మ ఘోరమెలా అయిందని అడుగుతావా. జాతస్యహి ధ్రువో మృత్యుః అని దానివల్ల జనన మరణాలు తప్పవు గదా. ఒక కర్మ మనం చేశామంటే దానికి ఫలితం లేకుండా పోదు. అది ఎప్పటికైనా మానవుడను భవించి తీరవలసిందే. అలాంటప్పు డింత దారుణమైన కర్మ ఎందుకు చెప్పావు నాకు.
ఇదంతా చూస్తే నీవు వ్యామి శ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహ యసీవమే కలగా పులగం చేసి మాటాడుతున్నావా అని తోస్తున్నది నాకు. ఇలా డొంక తిరుగుడుగా చెప్పి నా బుద్ధిని కలవర పెడుతున్నావు. అనవసరంగా నన్ను పెడదారి పట్టిస్తున్నావు. ఎందుకిలా నన్ను తికమక పరుస్తావు. తదేకం వద నిశ్చిత్య - యేన శ్రేయోహ మాప్నుయామ్. కర్మో జ్ఞానమో ఏదో ఒకటి తేల్చి చెప్పు నాకు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో. ఏది చెప్పినా దానివల్ల నాకు మేలు జరగాలే గాని కీడు జరగకూడదు. కాబట్టి నిష్కర్ష చేసి చెప్పు. నీకే నిష్కర్ష లేనట్టుంది చూడబోతే. నిష్కర్ష నీకే లేనప్పుడు నాకేమి చెబుతావు. అంచేత ఇప్పుడైనా మించిపోయింది లేదు.
Page 206