సాంఖ్య యోగము
భగవద్గీత
విహాయ కామాన్ యః సర్వాన్ పుమాంశ్చరతి నిఃస్పృహః |
నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్ఛతి || 71 ||
కాబట్టి మళ్లీ మళ్లీ గుర్తు చేస్తున్నాడు వ్యాసభగవానుడు మనకు. స్థితప్రజ్ఞుడైన వాడెలా ఉంటాడో అది అందుకొనే వాడెలా ఉండాలో రెండూ వర్ణిస్తున్నాడు. ఎందుకంటే మొదటనే పేర్కొన్నారు భాష్యకారులు స్థితాప్రజ్ఞుడి కేది లక్షణమో సాధకుడికది ప్రయత్నమని. అంచేత సాధకుజ్జీ సిద్ధుణీ ఇద్దరినీ మనసులో పెట్టుకొని వారిద్దరి వ్యవహారమూ సెలవిస్తున్నారు మహర్షి.
విహాయ కామాన్ యస్సర్వాన్ - అన్ని కోరికలూ విసర్జించి పుమాంశ్చరతి నిస్పృహః - అవసరమైనవి మాత్రమే జీవితంలో అనుభవిస్తూ ఆ అనుభవించేటప్పుడు కూడా వాటిమీద వల్లమాలిన అభిమానం పెట్టుకోకుండా ఏదో ఒక మహాశక్తి ప్రసాదిస్తున్నదిది అనుభవిస్తున్నాను ఇందులో నా ప్రజ్ఞ ఏమీ లేదని అహంకార మమకారాలు రెండూ వదిలేసి నిర్మమో నిరహంకారః అంటే ఏమన్న మాట. కర్తృత్వ భోక్తృత్వ బుద్ధి లేకుండా ఎవడిలా జీవితం గడుపుతూ పోతాడోవాడు కర్మయోగి. వాడికున్న ఈ నిష్కామకర్మ యోగమే క్రమంగా సత్త్వాన్ని శుద్ధి చేసి తద్ద్వారా ఆత్మజ్ఞానోదయానికి దారి తీస్తుంది. ఇదే సాధకుడి కుండవలసిన ప్రయత్నం.
Page 198