#


Index


విషాద యోగము భగవద్గీత

  అయితే ఇది శ్రవణ మైతే చేశాముగాని అంత మాత్రాన మన సంశయాలన్నీ తీరిపోవు. మనమూ మనం నిత్యమూ చూచే ఈ ప్రపంచమూ ఈ రెండింటికీ అతీతంగా ఉంటూ వీటిని నడుపుతూ ఉంటాడని భావించే ఆ ఈశ్వరుడూ - ఇదంతా వేరుగా ఎక్కడా లేదు. అంతా కలిసి ఒకే ఒక చైతన్యమని ఎలా నమ్మటమనే సంశయ మొకటి మనలను బాధిస్తుంటుంది. అది కేవలం సిద్ధాంతమే గాని జీవితంలో దృష్టాంత మవుతుందా మనకు - అసలు హేతు వాదానికైనా నిలుస్తుందా అని అనుమానం. ఇదిగో ఈ సంశయమనే వ్యాధి తొలగిపోవాలంటే రెండవ చికిత్స మననం. అది మనకు ప్రసాదించేవే బ్రహ్మ సూత్రాలు. హేతు దృష్టాంతాలు చూపుతూ బ్రహ్మాండంగా నిరూపిస్తారు బాదరాయణులు ఆత్మైకత్వాన్ని. సత్తా స్ఫూర్తులే ఆత్మ అంటే. అవి సామాన్యరూపంగా ఆత్మ అయితే విశేషరూపంగా జీవజగదీశ్వరులనే అనాత్మ. సామాన్యం కన్నా విశేషాలు వేరుగావు. సముద్ర జలం సామాన్యమైతే తరంగ ఋద్బుదాదులు విశేషాలు. అవి జలమనే సామాన్యంకంటే వేరుగా ఎక్కడ ఉన్నాయి. అలాగే ఆత్మ చైతన్యం కంటే అనాత్మ రూపమైన ఇవీ అన్యంగా లేవు. సర్వత్రా ఏ విశేషాన్ని చూచినా అస్తి భాతి అనే రెండు లక్షణాలే గదా కనిపిస్తున్నాయి. అంచేత అనాత్మ ప్రపంచమంతా ఆత్మ తాలూకు ఆ భాసే వస్తువుగాదు. వస్తువొక్కటే. అది స్వతః ప్రమాణమైన ఆత్మ. అదే ఇన్ని విశేషరూపాలుగా భాసిస్తున్నది. దీనికి దృష్టాంతాలు కావలసి వస్తే మృద్ధటాదులూ. సువర్ణాభరణాదులూ. మృత్తిక కంటే ఘటశరావాదులూ-సువర్ణంకంటే కటక కుండలాదులూ ఎలా వేరుగా లేవో - అదే ఆయా

Page 19

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు