#


Index


విషాద యోగము భగవద్గీత

చికిత్సా ఆరోగ్యం – ఇవి నాలుగూ నాలుగు భూమికలు మన ప్రయాణ మార్గంలో. నాలుగూ కలిసి వస్తేనే జీవిత గమ్య ప్రాప్తి మనకెప్పటికైనా. ఇందులో మనకు సంక్రమించిన వ్యాధులేవో చెప్పుకొన్నాము. పోతే ఏ వ్యాధి కేది చికిత్స - అది చేసే వైద్యులెవరు - వారు చేసే చికిత్స మూలంగా మనకు సిద్ధించే మహా ఫలమేమిటని ప్రశ్న. అజ్ఞానమనే వ్యాధికి చికిత్స శ్రవణం. అది మనకు ప్రసాదించే వైద్యు డుపనిషత్తు.

  ఇదం సర్వం యదయ మాత్మా. జీవ జగదీశ్వరులుగా విభక్తమయి కనిపించే ఈ సృష్టి అంతా ఏకైక మైన ఆత్మ చైతన్యమే - మరేదీగా దనే సర్వాత్మ జ్ఞానం మనకెవరికీ లేదిప్పుడు. నీవెన్ని శాస్త్రాలు మధించినా సంగీతాది కళలెన్ని అభ్యసించినా- ఎన్ని యజ్ఞ యాగాదులు చేసి స్వర్గాది భోగాలు లభిస్తాయని అఱ్ఱులు సాచినా - అవన్నీ ఆయా విశేషాలకు సంబంధించి అక్కడి కక్కడ పరిచ్ఛిన్నమైన జ్ఞానాలేగాని అన్నిటినీ కలుపుకొని ఏకంగా దర్శించే సామాన్య జ్ఞానం కాదు. కానంతవరకూ మానవుడి ఆకాంక్ష తీరదు. తీరనంత వరకూ సంతృప్తి లేదు. సంతృప్తే కలగాలంటే సాపేక్షమైన విద్యల Relative Sciences వెంటబడి సుఖం లేదు. సమస్యే తప్ప పరిష్కారానికి నోచుకోలేము. పోతే ప్రస్తుత మీ ఉపనిషత్తనే వైద్యుడు చేసే శ్రవణ మనే చికిత్స వల్ల మనకీ సమస్య తీరుతున్నది. సమస్త ప్రపంచమూ ఒకే ఒక ఆత్మ చైతన్యమనే అఖండ జ్ఞానాన్ని మనకందిస్తున్నది గనుక ఇక అజ్ఞానాని కాస్కారమే లేదు. పరిపూర్ణమైన జ్ఞానమిది.

Page 18

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు