#


Index

సాంఖ్య యోగము భగవద్గీత

  అయితే అలాటి స్థితప్రజ్ఞత ఏర్పడాలంటే దానికొక్కటే షరతు. ఆత్మచైతన్య మనేది దేదీప్యమానంగా ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉండాలి. అప్పుడే చీకటిలాంటి రసమనండి. రాగమనండి. వాసన ల నండి. చాపల్యమనండి. ఏదీ కనపడదిక. చీకటి కనిపిస్తే గదా భయపడటానికి. అంచేత ఇంతకూ మేము చెప్ప వచ్చేదేమంటే సమ్యగ్దర్శనాత్మికాయాః ప్రజ్ఞాయాః స్థైర్యం కర్తవ్య మని సలహా ఇస్తున్నారు గురువుగారు.

  కాని సమ్యద్దర్శనం స్థిరంగా నిలుపుకోవాలంటే ఒక్కసారిగా అది అలవడటం కష్టం అడుగడుగునా ఇంద్రియాలు మన మార్గంలో దోపిడీ దొంగలలాగా అక్కడక్కడ పొంచి ఉంటాయి. అమాంతంగా వచ్చి పైనబడతాయి. అవి ఇటూ అటూ లాగుతూ పోతే ప్రజ్ఞా స్థైర్యమనేది కలలోని వార్త. మరేమి చేయాలంటారు. చెబుతున్నది గీత. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః - నీవెంత పురుషుడవైనా నీకెంత వివేక జ్ఞానమున్నా సమయానికది పనిచేయదు. ఇంద్రియాణి ప్రమాధీని - చక్షురాదీంద్రియాలు సామాన్య మైనవి కావు. బలవత్తర మైనవవి మధించి పారేస్తాయి. దేన్ని. మనః నీ మనస్సును. ప్రసభం. అది కూడా నీకు తెలియకుండానే లాగేస్తాయి. మరలా విషయప్రపంచంలో తీసుకుపోయి పారేస్తాయి. ప్రసభ మంటున్నాడు. వద్దని గీపెట్టుకొన్నా వినవు. బలవంతంగా హరంతి. ప్రక్కకు లాగేస్తాయి. పారేస్తాయి. దేన్ని. మనః చెప్పాము గదా నీమనస్సును.

Page 175

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు