#


Index

సాంఖ్య యోగము భగవద్గీత

  అసలీ అధ్యాత్మ శాస్త్ర వ్యవహారమే వేరు. ఇది మరి ఏ శాస్త్రంలో చూడబోము. ఇక్కడ ఏది లక్షణమో Virtue అదే సాధన Endeavour కృతార్థుడి విషయంలో అది లక్షణమైతే సాధకుడి విషయంలో అది ప్రయత్నం. సిద్ధి అనేది కలిగేసరి కంతవరకూ వేర్వేరుగా కనిపించిన లక్షణ సాధనాలు రెండూ కలిసి లక్షణంగానే దర్శనమిస్తాయి. అంటే అప్పటికే మన్నమాట. స్థిత ప్రజ్ఞత్వమనే సిద్ధిని దృష్టిలో ఉంచుకొని మొదటినుంచీ మానవుడు సాధన కుపక్రమించాలని తాత్పర్యం. అప్పుడే వాడి ప్రయాణం గమ్యాభిముఖంగా సాగుతుంది. ప్రక్కలకు పోదు. ఇటూ అటూ చెదరిపోదు.

ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ |
ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే || 55 ||

  ప్రజహాతి యదా కామాన్ - ఎవడి ప్రజ్ఞ స్థితమయి కదలకుండా నిశ్చలంగా ఉంటుందో వాడు స్థిత ప్రజ్ఞుడు. అలా స్థిత ప్రజ్ఞుడు కాకుంటే గత ప్రజ్ఞుడు కాక ఏమవుతాడు. చెదురుతుందంటే దానికి కారణం కామం. కామమంటే కోరికలు. అవి మనోగతమ్. మనసులో తిష్ఠ వేసుకొని కూచుంటాయి ప్రతివాడికీ కోరికలైనా కావచ్చు అవి. కోరే పదార్ధాలైనా కావచ్చు. రెండూ కామాలే. అవి అనేకం. కోరే మనసు ఏకమైనా కోరబడే పదార్థా లనేకం. అనేక మయ్యేసరి కందులో కొన్ని అనుకూలమైనవి దగ్గర పెట్టుకోవాలని - ప్రతికూలమైతే దూరం చేసుకోవాలని కలుగుతుంటుంది ఆలోచన. అది మనసును తిప్పుతుంటుం దెప్పుడూ.

Page 162

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు