సాంఖ్య యోగము
భగవద్గీత
పొందినప్పుడే కర్మానుష్ఠానం కర్మ యోగంగా మారి సత్త్వ శుద్ధి ద్వారా ఎప్పటికైనా నీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది.
దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ధనంజయ |
బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః || 49 ||
కాబట్టి కర్మణ్యేవాధికారస్తే అని నీకు నీ స్థానమేదో చూపానంతే. నీవు పనికిరాని వాడనే మోనని బాధపడవద్దు. కర్మ అన్నానే గాని కర్మానుష్ఠానమని నిర్దేశించలేదు గదా. కర్మ యోగ మవలంబించమని నా వివక్షిత మంటాడు భగవానుడు. అలాటి శిక్షణ మార్గంలోనే పయనించ వలసిన వాడని అర్జునుణ్ణి గూర్చి ఆయన కున్న అభిప్రాయం. మనలో చాలామంది అలాటి అర్జునులే. మనలో 90 మంది సకామంగా ఆచరించే వారే కర్మలు. కామోకార్షిత్ - మన్యురకార్షిత్ అని సంధ్యావందనంలో నిత్యమూ చదువుతూనే ఉంటాం. ఈ పని కామమే చేయిస్తున్నది క్రోధమే చేయిస్తున్నదని దాని అర్ధం. అలాగే చేస్తున్నారు ఏ సత్కర్మనైనా దుష్కర్మనైనా కర్మిష్ఠులంతా. అలాగే గుడ్డిగా చేస్తూ పోయేదే అయితే దూరేణ హ్యవరం కర్మ అది చాలా నికృష్టమైన కర్మ. గొప్ప ఫలితమేదీ నీకందివ్వదు. ఏమిటా గొప్ప ఫలం. జ్ఞానోదయం. ఆత్మ జ్ఞానానికి పనికిరాని కర్మనెంత నీవు శాస్త్రీయంగా చేస్తే మాత్రమేమి ప్రయోజనం. అవరం బుద్ధి యోగాత్. సమత్వ బుద్ధితో కూడిన కర్మయోగం కన్నా అది చాలా రెట్లు హీనమైనది. ఈశ్వర స్పృహ పెట్టుకొని నిష్కామంగా ఆచరించే కర్మయోగమే దానికన్నా
Page 151