#


Index

సాంఖ్య యోగము భగవద్గీత

రెండు విధాలు. అందులో కర్తనను కొన్నప్పుడే ఫలం మీద సంగ మేర్పడుతుంది. అలా కాక ఈశ్వరుడే దీనికి కర్త ఆయనే నాద్వారా ఈ పని చేస్తున్నాడు. ఈ కర్మఫలం కూడా ఆయనకే చెందుతుందని రెండింటితోనూ నీవు తెగతెంపులు చేసుకొన్నావో ధన్యుడవు. ఈశ్వర స్పృహతో చేయాలి ఏ కర్మ చేసినా. అది చాలా ముఖ్యం. ఆ స్పృహ Awareness లేకుండా సంగమనేది వదులుకోలేవు. అసాధ్యం. స్పృహ ఉంటే మాత్రమ సాధ్యం కాదు. సాధ్యమే.

  అలా అసక్తమైన బుద్ధితోనే ఉండాలి చివరిదాకా. సిద్ధసిద్ధ్యి స్సమోభూత్వా ఆఖరుకు సిద్ధి అయినా అసిద్ధి అయినా ఏకంగా చూడగలిగి ఉండాలి. తేడా చూడగూడదు. సిద్ధి అంటే దీనివల్ల నాకు సత్త్వశుద్ధి ఏర్పడుతుంది. అది నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తుందని కలలు కనగూడదు. అలాగే అసిద్ధి ఏర్పడి ఏదీ నీకు ప్రాప్తించకపోతే కుంగిపోకూడదు. అనుకూలించినా ప్రతికూలించినా అది కూడా ఈశ్వరుడికే అప్పజెప్పి చేతులు దులుపుకోవాలి. సమత్వం యోగ ఉచ్యతే - ఈ సమత్వ బుద్ధికే యోగమని పేరు. యోగస్థః కురు ఇలాటి యోగాన్ని అవలంబించి అందులోనే పాతుకొని పోవాలి నీవు. అది నీవరకే పరిమితమైతే నీకెప్పటికీ రాదు. నీ బుద్ధి అంతకంతకు విస్తరించి ఈశ్వరుడి స్థాయినందుకొని ఆ ఈశ్వర స్ఫురణ తోనే నిండిపోవాలి. అలాటి విశాలమైన బుద్ధితో నీవే కర్మ చేసినా చేస్తూ పోవాలి. ఇలాటి శిక్షణ Discipline

Page 150

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు