సాంఖ్య యోగము
భగవద్గీత
కర్మ చేయవలసిందే. చేయమన్నారు గదా అని కర్తృత్వభోక్తృత్వాలు పెట్టుకొని చేయగూడదు. అప్పటికి చేయటమూ కాదు. మానటమూ కాదు. చేస్తే యాంత్రికంగా చేయటం కాదు. మానితే తప్పించుకొందామనే భావంతో మానటం కాదు. మాతేసంగో స్వకర్మణి కర్మలు ఎగగొట్టి తిరుగుదామనే పలాయనవాదం Excapism పనికిరాదు. యాంత్రికంగా చేసినా అసలే మానేసినా ఈ రెండింటిలోనూ నీకు జ్ఞానసిద్ధి లేదు. అవి రెండూ రెండు అతి చేష్టలు Extremes. నిర్లిప్తంగా చేయాలి ఏ పని అయినా అదే కర్మయోగం. జ్ఞానానికి తోడ్పడేది కేవల మీ కర్మ యోగమనే మధ్యే మార్గమే. అర్జునుడి ద్వారా లోకానికంతా గీత చేస్తున్న మహోపదేశ మిది.
యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ |
సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే || 48 ||
అయితే ఇప్పుడొక పెద్ద చిక్కు వచ్చి పడ్డది. కర్మ మానేయటం పనికిరాదు చేయమంటున్నారు బాగానే ఉంది. ఫలిత మాసించకుండా పనిచేయగలమా. అలాగే నేను చేస్తున్నాననే భావం పెట్టుకోకుండా చేయగలమా అది సాధ్యమా. సాధ్యమే నంటున్నది గీత. యోగస్థః కురు - సంగంత్యక్త్వా అని అది మనకిచ్చే సలహా. మామూలుగా చూస్తే అసాధ్యమేనని తోచవచ్చు నీకు. కాని ఈ మార్గంలో కొంత శిక్షణ పొందినవాడి కంత అసాధ్యమేమీ గాదని హామీ ఇస్తున్నాడు పరమాత్మ, అది ఎలాగంటే నీవు యోగస్థుడవే అయితే సంగం వదిలేయవచ్చు. సంగమంటే అభిమానం Attachment. కర్తృసంగం. ఫలసంగమని సంగం
Page 149