విషాద యోగము
భగవద్గీత
1. విషాద యోగము
ఉపనిషత్తులు - బ్రహ్మ సూత్రాలు - భగవద్గీత - ఈ మూడింటికీ ప్రస్థాన త్రయమని పేరు. ప్రస్థాన మంటే మార్గమని అర్థం. ప్రస్థాన త్రయమంటే మూడు మార్గాలని బోధపడుతున్నది. కాని వాస్తవంలో మూడు మార్గాలు లేవిక్కడ. ఒకే ఒక మార్గం మోక్షానికి. నాన్యః పంథా అయనాయ విద్యతే అని చాటుతున్నది శాస్త్రం. మరి మూడేమిటి. ఒకే మార్గంలో మూడు మజిలీలవి. అందులో మొదటి భూమిక ఉపనిషత్తులు. రెండవది బ్రహ్మసూత్రాలు. పోతే మూడవది భగవద్గీత. మోక్షసాధకుడైన మానవు డంచెల వారీగా ఈ మూడింటిలోనూ ప్రయాణం చేస్తూపోతే చివరకు మోక్షమనే గమ్యాన్ని చేరగలడు. ఉపనిషత్తులు శ్రవణానికీ బ్రహ్మసూత్రాలు మననానికీ భగవద్గీత నిది ధ్యాసనకూ తోడ్పడతాయని చెబుతారు పెద్దలు.
Page 15