#


Index

ఉపోద్ఘాతము (ప్రధమ) భగవద్గీత

తెలియజేస్తే తెలుసుకొని సంతోషిస్తాను. కనుక వివేచనా శీలురైన పాఠకులు ముందుగా నేను వెలువరించి మీకందించిన ఈ ప్రధమ సంపుటాన్ని జాగ్రత్తగా పరిశీలించి నాకు తెలిపితే మీ ఉత్సాహాన్ని బట్టి మిగతా రెండు సంపుటాలూ కాలక్రమేణా ప్రకటించి మిమ్ము తృప్తి పరచాలని ఉంది నాకు. ఈ రూపంగా శ్రీ కృష్ణ కృష్ణద్వైపాయన శంకర భగవత్పాదాది సద్గురు ప్రసాద లబ్ధమైన అద్వైత విజ్ఞాన ధనాన్ని నలుగురమూ పంచుకొని అనుభవిస్తూ మానవ జన్మ సార్ధకం చేసుకోవాలని కూడా ఉంది. ఇక సెలవా మరి.

ఇతి
విబుధ జన విధేయః
శ్రీనివాస నామధేయః





Page 14

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు