#


Index

ఉపోద్ఘాతము (ప్రధమ) భగవద్గీత

  ఇంకొకటి ఏమంటే మిగతా ఎక్కువగా చెప్పిన విషయాలన్నీ కత్తిరించినా నేను చెబుతూ వచ్చిన అతి ముఖ్యమైన భావాలేవీ జారిపోకుండా సేకరించటం నా బాధ్యత. అక్కడక్కడ శాంకరభాష్య సూక్తులుదా హరిస్తూ వాటితో నా భావాలు సరిపోల్చుకొంటూ రావలసి వచ్చింది. అదీ ఇదీ అయ్యేసరికి గ్రంధ పరిమాణం బాగా పెరిగిపోయింది. అందులోనూ ఈ మొదటి షట్కమే ఇప్పుడయిదు వందల పేజీలకు పైగా తయారయింది. ఇక మిగతా రెండు షట్కాలూ చేరితే మూడూ కలిసి 15, 16 వందల పుటలకు తక్కువ కావు. ఇంకా ఎక్కువే అవుతాయేమో నని కూడా అనుమానమే. ఇదంతా ఓపికగా వ్రాసి మొత్తం గ్రంధ మొక్కసారే ప్రకటిద్దామా అని నాకాలోచన వచ్చింది. అలాగైతే మూడు సంపుటాలూ పాఠకుల కొకే మారు అందజేయ వచ్చు. కాని దానికి చాలా దీర్ఘకాలం పడుతుంది. జిజ్ఞాసువులైన పాఠకులింత కాల మెదురు చూడలేరు కూడా. అంచేత అంత దీర్ఘమైన ప్రణాళిక ఇప్పుడే వేయట మిష్టం లేక లేని ఓపిక తెచ్చుకొని మొదటి ఆరధ్యాయాలూ ముందుగా వ్రాసి ప్రకటించవలసి వస్తున్నది.

  సమగ్రమైన గ్రంథ మొక్కసారిగా మీకు అందివ్వ లేకపోయాననే కొరత ఒకటి మనసులో ఉన్నప్పటికీ మొదట ఈ ప్రధమ షట్కమైనా పూర్తి చేసి మీ చేతిలో పెట్టగలిగానని నాకు తృప్తి. భగవద్గీతా సర్వస్వమని పేరుపెట్టి నందుకిది ఆపేరుకు తగినట్టుందో లేదో నాకు తెలియదు. మీరు

Page 13

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు