సాంఖ్య యోగము
భగవద్గీత
ఉన్న నీళ్లన్నీ త్రాగలేడు వాడు. అలాగని అసలే తాగకుండా వెళ్లిపోడు. 'యవానర్ధః తావాన్' ఎంతమాత్రంతో తన దాహం తీరుతుందో అంతేగదా.
అలాగే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః - వేదం కూడా ఒక బావిలాంటిది. చెరువులాంటిది. అక్కడ నీరు సమృద్ధిగా ఉన్నట్టే ఇక్కడ పుష్కలంగా దొరుకుతుంది సామగ్రి. అది కర్మ అని చెప్పు. ఆయా దేవతల తాలూకు ఉపాసనలని చెప్పు. మంత్రతంత్రాదులు చెప్పు. ఆఖరు కాత్మజ్ఞానమని చెప్పు. అన్నీ మనకు లభిస్తా యందులో. లభిస్తాయి గదా అది చెప్పినవన్నీ తూచా తప్పకుండా పాటించాలని ఎవరు బలవంతం చేశారు నిన్ను. అందులో నీకు కావలసిన దేదో అదే తీసుకోవచ్చుగదా. అది గాక ఎంతైనా ఉండవచ్చు ఆ కార్ఖానలో. అవన్నీ నీవు త్రవ్వి తలకెత్తు కోవలసిన అవసరం దేనికని అడుగుతున్నాడు పరమాత్మ.
అయితే అందులో నన్నేది తీసుకోమని అడుగుతున్నావా. బ్రాహ్మణస్య విజానతః అని జవాబు విజానతః అంటే నీవు వివేకవంతు డ వయితే బ్రాహ్మణస్య బ్రహ్మజ్ఞానమే నీకు కావలసిన దందులో. అదే నీవందుకో మిగతాదంతా నీకనవసరం. నీకెంత కావాలో అంతే త్రాగి మిగతా నీళ్లెన్ని ఉన్నా అక్కరలేదని ఎలా వెళ్లిపోతావో - అలాగే నీకు జన్మతారకమైన ఆత్మజ్ఞానమే పట్టుకో వేదంలో. మిగతా కర్మకాండ ఎంత ఉంటే నీకెందుకు. అదేమైనా జన్మరాహిత్య మనే మహాఫలం నీకు ఇస్తుందా చస్తుందా. ఇంకా సంసారబంధానికే దారి తీస్తుంది. స్వర్గానికి పోయినా సవతి పోరు
Page 144