సాంఖ్య యోగము
భగవద్గీత
మనమే గాక ఆ మాటకు వస్తే మనం చూచే ప్రపంచం కూడా త్రిగుణాత్మకమే. దేశం సత్త్వ గుణమైతే కాలం రజోగుణమైతే వస్తువులన్నీ తమో గుణమే. దేశకాల వస్తువులేగా Space Time Substance ప్రపంచమంటే. ఈ విధంగా అటు పిండాండమూ ఇటు బ్రహ్మాండమూ రెండూ కూడా త్రిగుణాత్మకమే అయికూచున్నాయి. అంతేకాదు. మానవుడి మనస్సే గుణాధీన మయినప్పు డది సృష్టించిన వాఙ్మయం గుణాతీత మవుతుందా. ఎంత అపౌరుషేయ మని నీవు నెత్తిన బెట్టుకొన్నా ఆఖరుకు వేదవాఙ్మయం కూడా త్రైగుణ్య విషయా వేదాః త్రిగుణాల పరిధి దాటి పోలేదు. అప్పటికీ బ్రహ్మాండమూ Macro దానిలో పరిభ్రమించే ఈ పిండాండమూ Micro అది సృష్టించుకొన్న వాఙ్మయ ప్రపంచమూ Intel-lectual world మూడూ ఈ మూడు గుణాలకూ లోబడ్డ బాపతే.
ఇలా సమస్త సృష్టి గుణాధీనమై బ్రతుకు తున్నప్పుడు నీవు వేదం చెప్పిందని ఏ యజ్ఞం చేసినా ఏయాగం చేసినా తద్వారా ఏ స్వర్గానికి వెళ్లినా అక్కడ ఏయే సుఖాలు నీవాసించినా అదంతా తాత్కాలికమే. పరిచ్ఛిన్నమే సొంతమే. అనంతమైన సుఖానుభవం నీవందుకోలేవు. కారణం గుణాధీనమైన బ్రతుకుకు అనంత సుఖమెలా లభిస్తుంది. మరి అలాంటి ఆత్మానుభవమే కావాలంటే ఏమిటి మార్గమని నీవడగవచ్చు. అది ఈ విధి కాండలో Dos & Donts దొరకదు నీకు. జ్ఞానకాండలోనే లభిస్తుంది.
Page 141