సాంఖ్య యోగము
భగవద్గీత
ఇదుగో ఈ సుఖానుభవానికి సాధనభూతమే ఈ వేదం చెప్పే కర్మకాండా. ఉపాసనాకాండా. ఇది ఎంతెంత శ్రద్ధాభక్తులతో వీరాచరించినా పునరావృత్తి తప్పదు వీరికి. మరలా వచ్చి ఈ సంసార సాగరంలో మత్స్యాది జలజంతువులలాగా ఈదుతూ చావవలసిందే. అలాంటప్పుడు వీరికీ సంసార సమస్య ఏమి పరిష్కారమయినట్టు.
భోగైశ్వర్యప్రసక్తానాం తయాపహృతచేతసామ్ |
వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే || 44 ||
ఈ కర్మిష్ఠులకూ ఉపాసకులకూ - ఇద్దరికీ కనిపించే వెప్పుడూ భోగాలూ - ఐశ్వర్యాలే. అది తప్ప వీరికి మరొక లోకమే లేదు. భోగైశ్వర్య ప్రసక్తానాం ఎప్పుడెప్పుడీ శరీరాన్ని ఇక్కడ వదిలేసిపోయి ఆ స్వర్గసుఖాలను వాటేసుకుందామా అని ఉవ్విళ్లూరు తుంటారు. అదే లోకంగా బ్రతుకుతుంటారు. అవే తామూ తామే అవి అన్నట్టు మమేకమై పోతుంటారు. తయాపహృత చేతసాం - అలాంటి కర్మలన్నీ బోధించే వేద వాక్యాలను మాత్రమే ప్రమాణంగా తీసుకొని వాటి చేత పూర్తిగా మతి చెడగొట్టుకొని తామెంచుకొన్న మార్గంలోనే గుడ్డిగా పడిపోతుంటారు. మరొక మార్గంలో వారి బుద్ధి పనిచేయదు.
వ్యవసాయాత్మికా బుద్ధి స్సమాధౌన విధీయతే - మరొక మార్గమంటే ఏమిటది. జ్ఞానయోగమూ దానికి తోడ్పడే కర్మయోగమూ. అవి రెండూ కరువయి పోతాయి వారికి. ఎంతో దృఢమైన నిశ్చయముంటే గాని
Page 139