సాంఖ్య యోగము
భగవద్గీత
పరమే కనిపిస్తుంటుంది వీరికి. అది కూడా అపవర్గం కాదు. స్వర్గం. ఇహం లాగే అదీ ఒక లోకమే. ఇక్కడ మానవులైతే అక్కడ దేవతలు. ఇక్కడ సుఖమూ దుఃఖమూ రెండూ మిళితమై ఉంటే అక్కడ సుఖమే అనుభవిస్తారు మహా అయితే. అనుభవిస్తే మాత్రం ఎంత కాలమా అనుభవం. పుణ్యఫలం ఖర్చయిపోగానే జన్మకర్మ ఫల ప్రదామ్. మళ్లీ తలక్రిందులుగా వచ్చి నేలమీద పడవలసిందే. పూర్వం యయాతి నహుషుడు - ఇలాంటి వారందరికీ పట్టిన గతి అదేగా. క్షీణేపుణ్యే మర్త్య లోకం విశంతి. తప్పేదేముంది. కర్మ చేస్తున్నాడంటే అది సత్కర్మ అయినా దుష్కర్మ అయినా దాని ఫలానుభవం తప్పించుకోలేడు మానవుడు. ఏమిటది. జన్మ. కర్మఫలం జన్మే. ప్రదాం. దాన్నే ప్రసాదిస్తుంది మనకీ కర్మ.
ఇలాంటి క్రియావిశేషహుళామ్. కర్మ విశేషాలన్నీ చిలువలు పలువలు పెట్టి నీకూ నాకూ ఏకరువు పెడుతుంటుంది వేదవాక్కు వాఙ్మయమంతా దీనితో నిండిపోయింది. భోగైశ్వర్యగతిం ప్రతి అది విని ఈ శ్రోత్రియులంతా తూచా తప్పకుండా ఆ కర్మలన్నీ తమ కోసమే ఉన్నట్లు వాటి నాచరించలేక సతమత మవుతుంటారు. ఎందుకు ఏమిటి వాటి ప్రయోజనమని అడిగితే భోగమూ ఐశ్వర్యమూ అని వర్ణిస్తారు. భోగమంటే స్వర్గసుఖాలు. ఐశ్వర్యమంటే అవన్నీ తమ చెప్పుచేతల్లో ఉండటం. అంటే తమ ఇష్టానుసారంగా ఏ సుఖాలైనా అనుభవించ వచ్చునన్న మాట.
Page 138