#


Index

సాంఖ్య యోగము భగవద్గీత

ఇక్కడా అదే అర్థం. పైకి పటారమేగాని లోపల లొటారం. ఊరక వాగుతుంటారు నోరు పెట్టుకొని వివేచన లేదు. పాడు లేదు. అవివేకమైన ప్రసంగం చేస్తుంటారు.

  ఎవరు వారు. వేదవాదరతాః నాలుగు వేదాలూ గుక్క తిప్పుకోకుండా వల్లెవేసే పండితులు. పండితమ్మన్యులేగాని నిజమైన పండితులు కారు. పండా ఆత్మ విషయాబుద్ధిః అని గురువుగారెప్పుడో చెప్పారు. ఆత్మజ్ఞానముంటే చెప్పు. వాడు పండితుడు. అది లేనివారు పండిత బ్రువులే. ఎందుకంటే నాన్యదస్తీతి వాదినః - వేదమంటే మంత్ర బ్రాహ్మణ భాగాలు రెండే. అవి కూడా విధినిషేధాత్మకమే. ఈ పనిచేయి నీవు. దీనివల్ల నీకు స్వర్గం లభిస్తుంది. ఇది చేయవద్దు. చేశావంటే నీకు నరకమే ప్రాప్తిస్తుంది సుమా అని ధర్మాధర్మాల తాలూకు జ్ఞానం మనకందివ్వటమే వేదం చేసేపని. స్వర్గపశ్వాది ఫలమూ దానికి సంబంధించిన యజ్ఞయాగాది సాధన సామగ్రీ మనకు బోధించటం వరకే దాని కర్తవ్యమని భాష్యకారులు కూడా సెలవిస్తున్నారు. ఇంతకు మించి మరేదీ చెప్పదు వేదవాఙ్మయమని వాదిస్తారీ వైదికులు.

కామాత్మానః స్వర్గపరా జన్మకర్మఫలప్రదామ్ |
క్రియావిశేషబహులాం భోగైశ్వర్యగతిం ప్రతి || 43 ||

   కామాత్మానః స్వర్గపరాః - కామమే వీరి స్వభావం. వీరి మనస్సులను ఆపరేట్ చేసి చూచినా అందులో కోరికలు తప్ప మరేదీ కనపడదు మనకు. ఆ కోరికలయినా దేనిమీద. ఒకే ఒకదానిమీద. అది స్వర్గం. ఇహం తప్పితే

Page 137

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు