సాంఖ్య యోగము
భగవద్గీత
పుడుతూ చస్తూ - చస్తూ పుడుతూ పోతే ఎప్పటికీ భయం తీరేది. ఎప్పటికీ విషవలయంలో నుంచి మనం బయటపడేది. అలా బయటపడాలంటే వెంటనే జ్ఞానమబ్బక పోయినా దానినందించే ఈ కర్మయోగమైనా ఆచరిస్తూపోవాలి మనం. ఆచరిస్తే మోక్షమార్గంలోనే ప్రయాణం చేస్తుంటాము కాబట్టి కొంచె మాలస్యంగా నైనా గమ్యం చేరగలమని ధైర్యం మనకు.
వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ కురునందన |
బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయోఽవ్యవసాయినామ్ || 41 ||
ఇప్పుడీ సాంఖ్యబుద్ధి అనీ యోగబుద్ధి అనీ చెప్పామే. చెప్పామంటే మొదటిది చెప్పాము. రెండవది తరువాత చెప్పబోతా మనుకోండి. ఇవి రెండూ కలిసి వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ. ఒకే ఒక బుద్ధి. రెండు విమానాలు కలిసి న్యూయార్కు చేరటానికెలా తోడ్పడతాయో అలాగే రెండూ కలిసి చివరకు మోక్షాన్నే ప్రసాదిస్తాయి. కాబట్టి రెండూ ఒకే ఒక బుద్ది. వ్యవసాయాత్మకం అంటే నిశ్చయాత్మకమైన బుద్ధి. ఎంచేత. సమ్యక్రమాణం వల్ల ఏర్పడిన బుద్ధి ఇది. ఏది చూడాలో అదే చూస్తుంది జ్ఞానం. దాన్ని ఎలా అందుకోవాలో అలాగే అందుకొంటుంది యోగం. కనుకనే శ్రేయోమార్గాన్ని చూపుతాయి మనకు రెండూ కలిసి.
మరి మిగతా బుద్ధులో. బహుశాఖాహ్యనంతాశ్చ అంటున్నది గీత. దీనికి విపరీతమైన బుద్ధులవి. అనేకశాఖలూ అనంతాలూ, శాఖోపశాఖలుగా మారి ఒక్కొక్క శాఖలో మరలా అనంతంగా సాగిపోతుంటాయి.
Page 134