సాంఖ్య యోగము
భగవద్గీత
ఉంటుంది ఫలితం. యధాకృష్యాదేః అని వ్రాస్తున్నారు స్వామివారు. అది ఒక సేద్యం లాంటిది గాదు ఫలితం లేకపోవటానికి. భూమి సేద్యం చేస్తుంటా డొక రైతు. పంట చేతికి వస్తుందని. వస్తే రావచ్చు. లేకపోతే పోవచ్చు. ఎన్నో అవరోధా లుంటాయి దానికి. సకాలంలో వర్షాలు పడకపోయినా లేక దానికే తెగులు తగిలినా - ఏ ఉపద్రవం సంభవించినా వాడికి నష్టమే.
అలాంటి కష్టనష్టాలులేవిక్కడ. ఫలితం గారంటీ. ఎంత చేస్తే అంత ఫలితం. అంతేకాదు. ప్రత్యవాయ దోషం కూడా లేదు దీనికి. శాస్త్రీయమైన కర్మ లాచరిస్తున్నప్పుడు ప్రత్యవాయ దోషమని ఒకటున్నది. అది మానేసినా ప్రత్యవాయమే. చేసేది అపసవ్యంగా చేసినా ప్రత్యవాయమే. వైగుణ్యమని కూడా Defect అంటారు దీన్ని. పోతే ఈ కర్మయోగంలో అలాటి ప్రమాదం కూడా లేదని హామీ ఇస్తున్నాడు. చికిత్సలాంటిది కాదిది. రోగానికి చికిత్స చేయకపోయినా తప్పే. ఒక రోగాని కింకొక చికిత్స చేసినా తప్పే. ఇందులో ఆ భయం కూడా లేదు. చేసినదానికి మోసం రాదు. చేయకుంటే చెడిపోయింది లేదు. ఎంత చేస్తే అంతదాకా లాభముంటూనే ఉంటుంది. నష్టమే మాత్రమూ లేదు.
అంతేకాదు. స్వల్పమ ప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఏ కొంచెమాచరించినా చాలు ఈ యోగధర్మం. ఎంతో భయం నుంచి మనలను కాపాడుతుంది. సంసార భయమే భయం. జన్మ మరణ లక్షణమది. జాతస్యహి ధ్రువో మృత్యుః అని భయపెట్టాడుగా పరమాత్మ. మరి ఎప్పుడూ
Page 133